జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదుపరి సభ వివరాలు ఖరారు అయ్యాయి. ఈ నెల 14న గుంటూరు లో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
జనసేన తలపెట్టిన ఈ భారీ బహిరంగసభకు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ నాయకుడు తులసి ధర్మచరణ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14 వ తేదీ సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు.
అయితే ఫిబ్రవరి లో మత్స్యకారులకి మద్దతు గా పవన్ తలపెట్టిన శ్రీకాకుళం సభ క్యాన్సిల్ అవడం తెలిసిందే. అంతే కాక జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక కూడా ఇంకా రావాల్సి ఉంది. అదే విధంగా ఈ గుంటూరు సభ ఎజెండా ఏంటనేది తెలియాల్సి ఉంది. అనంతపురం యాత్ర కరవు గురించి అని, శ్రీకాకుళం లో తలపెట్టిన యాత్ర మత్స్యకారుల గురించి అని ప్రకటించినట్టుగా, ఈ సభ దేని గురించి అనేది వివరాలు ప్రకటించలేదు.