“ప్రధానమంత్రి నరేంద్రమోడీకి భయపడి.. తడిపేసుకుంటున్నానని.. టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కానీ నరేంద్రమోడీపై మాట్లాడుతోంది నేనే..” అంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సహజంగా ఇలాంటి డైలాగ్ వచ్చిన తర్వాత ఎవరికైనా… మోడీ మోసగాడు.. ఏపీని దారుణంగా వంచించాడు… అని విమర్శిస్తారని ఎదురు చూస్తారు. పైగా ఆయన పవన్ కల్యాణ్…ఎవరైనా అన్యాయం చేస్తే రగిలిపోతారు. అంతు చూస్తానని గుండెలు బాదుకుంటారు. అండగా ఉంటానని గాల్లో పిడిగుద్దులు గుద్దుతారు. .. అంటే అంత ఫైర్ ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్. అలాంటప్పుడు.. మోడీ ప్రస్తావన వచ్చి.. ఆయనపై తిరగబోతోండి… మాట్లాడుతోంది తానేనని చెప్పినప్పుడు.. ఎలాంటి డైలాగులు బయటకు రావాలి..?
ఏపీ ప్రజల్లో మోడీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆ విషయం చిన్న పిల్లవాడినడిగినా చెబుతారు. అలాంటిప్పుడు పవన్ ట్రేడ్ మార్క్ డైలాగులైనా…” గుడ్డలిప్పదీసి తంతాం.. దగ్గర్నుంచి ప్రభుత్వాన్ని కూలదోస్తాం వరకూ అనేక మాటలు చెప్పాలి. కానీ మోడీపై మాట్లాడేది నేనే అంటారు… ఆ తర్వాత మోడీపై మాట్లాడకుండానే పక్కకు వెళ్లిపోతున్నారు. మర్చిపోయారేమో… అర్జంట్ మ్యాటర్ గుర్తొచ్చి .. దాని మీదకు వెళ్లిపోయారమో.. స్పీచ్ మొత్తంలో ఎక్కడో చోట.. ” మోడీ సంగతి తేలుస్తానని..” చెబుతారేమోనని… చాలా మంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు. కానీ “మోడీకి భయపడను.. మోడీపై మోడీపై మాట్లాడేది నేనే” అన్నదానితోనే సరిపెడతారు. నేను లేవను కానీ.. లేస్తే మనిషిని కానట్లుగా పవన్ వ్యవహారశైలి ఉంటుంది.
మోడీపై మాట్లాడటం అంటే.. అన్యాయాన్ని ప్రశ్నించకుండా.. ఆయనకు మోడీగారు అని గౌరవం ఇచ్చి సంబోధించడం అనుకుంటున్నట్లు ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడెప్పుడో.. మోడీని బాలకృష్ణ తిట్టారని.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారు. అదేదో బాలకృష్ణ మోడీకి అన్యాయం చేసేసినట్లు అవమానం పొందినట్లు.. బీజేపీ నేతలు కూడా.. ఫీల్ కాని విధంగా పవన్ ఫీలైపోయారు. ప్రజల్లో మోడీపై వ్యతిరేకత ఉందని తెలుసు.. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేని దుస్థితికి పవన్ వెళ్లిపోయారు. తెర వెనుక ఏం జరిగిందో.. కానీ.. ఓ బలమైన కారణమే.. బీజేపీపై.. మోడీపై.. విమర్సలు చేయలేని పరస్థితిని పవన్ కల్యాణ్ కు కల్పించిందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఆ కారణం ఏమిటన్నది బయటకు రావాల్సి ఉంది..! ..