కందిరీగతో దర్శకుడిగా మారిపోయిన కెమెరామెన్ సంతోష్ శ్రీనివాస్. ఆ తరవాత ఎన్టీఆర్తోరభస చేశాడు. అది వర్కవుట్ కాలేదు. దాంతో సంతోష్ కి విరామం తప్పలేదు. రామ్‌తో చేసిన హైపర్ ఓకే అనిపించింది. ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్‌కి బంపర్ ఆఫర్ తగిలినట్టు టాలీవుడ్ టాక్. త్వరలోనే పవన్ చిత్రానికి సంతోష్ దర్శకత్వం వహించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీస్ సంస్థ పవన్‌తో ఓ సినిమా చేయాలనుకొంటోంది. ఇటీవల సంతోష్ శ్రీనివాస్ పవన్ కోసం ఓ స్క్రిప్టు రెడీ చేసి వినిపించాడట. అది మైత్రీ సంస్థకు బాగా నచ్చిందని, ఈ సినిమాని పవన్‌తో చేయాలని ఫిక్సయినట్టు తెలుస్తోంది.
అయితే ఈ కథ ని పవన్‌కు ఇంత వరకూ వినిపించలేదు. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం ఖాయమని, ఈ కథ అంత బాగుందని మైత్రీ మూవీస్ సంస్థ నమ్ముతోంది. కాటమరాయుడు షూటింగ్ ఎలాగూ అయిపోయింది కాబట్టి. ఒకట్రెండు రోజుల్లో పవన్‌కి కథ చెప్పే అవకాశాలున్నాయి. పవన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. నేసన్ దర్శకత్వంలో ఒకటి, మిత్రుడు త్రివిక్రమ్ తో మరో సినిమా చేయాల్సివుంది. ఆ తరవాతే సంతోష్ శ్రీనివాస్ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది.