పవన్ కల్యాణ్ నాలుగోసారి తండ్రయ్యారు. అభిమానులంతా ఆనందడోళికల్లో మునిగిపోతున్నారు. పవన్ తన బాబుని చూస్తూ మురిసిపోతున్న ఓ ఫొటో సోషల్ మీడియా అంతా హల్ చల్ చేస్తోంది. మరో పవర్ స్టార్ పుట్టేశాడంటూ.. అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు. పవన్ తండ్రిగా ఇప్పుడో కొత్త నిర్ణయం తీసుకొన్నారని తెలుస్తోంది. ఈ బాబుకి క్రీష్టియన్ సంప్రదాయం ప్రకారం పేరు పెట్టాలని నిర్ణయించుకొన్నార్ట. అన్నా లెజ్నావా పవన్‌కి మూడో భార్య. తనో క్రీష్టియన్. పవన్ – అన్నాలకు ఇది వరకు ఓ పాప పుట్టింది. ఆ అమ్మాయికి పొలెన్ అంటూ క్రీష్టియన్ పేరు పెట్టాడు పవన్. ఇప్పుడు బాబు కి కూడా క్రీష్టియన్ పేరు పెట్టే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఓ విప్లవ వీరుడి పేరు స్మరణకు వచ్చేలా పవన్ తన బాబు పేరు నిర్ణయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.