జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం ప్రచార వాహనం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఓ గ్యారేజీలో ప్రచార వాహనానికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు. సిద్ధమైన వాహనాన్ని, ట్రయల్ రన్‌ను పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ వాహనానికి వారాహి అని పేరు పెట్టారు. ఇది యుద్ద ట్యాంక్ లుక్ తో వుంది,
వారాహి వాహనానికి సంబంధించి వీడియో, ఫోటోలను పవన్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అని ప్రకటించారు. మరో వైపు సినిమాలతో కూడా బిజీగా వున్నారు పవన్. హరిహర వీరమల్లు చివరి దశకు చేరుకుంది. మొన్ననే సుజీత్ దర్శకత్వంలో సినిమాని ప్రకటించారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.