ఉద్దానంకి సూర్యుడు ఉన్నాడో లేడో కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం ఉన్నాడని జనసేనాని చాలా హైపిచ్ లో గతంలో శ్రీకాకుళం పోరాటయాత్రలో ప్రకటించారు. అయితే టిట్లి తుపాను వచ్చిన వెంటనే రాలేకపోయారు, కారణం సెక్యూరిటీ సమస్యలు అంట.ఈ భద్రతా సమస్య కారణంగా ఉద్దానం సూర్యుడు వారం రోజల తర్వాత ఉదయించాడు. ఎక్కడైతే తాను ఉద్దానం కోసం ఉదయించిన ఉద్యమ సూర్యుడిగా చెప్పుకున్నాడో అక్కడి ప్రజలకు దర్శనం ఇచ్చారు. వారి బాధలు చూసి.. కన్నీళ్లు తెచ్చుకున్నంత పని చేశారు. నిజానికి కన్నీళ్లొచ్చాయి,కానీ బయటకు రాకుండా మింగేశారు. ఇంత వరకూ భావోద్వేగపూరితమైన ఘట్టం.పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పాయింట్లను ఒక పుస్తకంలో నోట్ చేసుకుంటూ ఉంటారు మేధావిలాగా.అలాగే ఇక్కడ కూడా బాధితుల్ని అడిగి వివరాలు తెలుసుకుని , ఒక పుస్తకం లో రాసుకున్నారు పవన్ కళ్యాణ్.ఇలా రాసుకోవడం చాలా సార్లు చూశాం. ఆ మధ్య మహాప్రస్థానం పుస్తకం చదువుతూ.. అందులో పాయింట్లను తిరిగి రాసుకోవడం… సిక్కోలులో చేసిన దీక్షలోనే.. అదీ ఉద్దానం కోసమే చేసిన దీక్షలో చూశాం.. అచ్చంగా అలానే.. నిన్న కూడా బాధితులు చెప్పిన పాయింట్లను.. యమ సీరియస్గా రాసుకున్నారు. చెప్పిన వివరాలన్నీ రాసుకున్న తర్వాత..ఉద్దానం బాధితురాలిని… ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని…ధైర్యం చెప్పారు. అప్పుడే జరగకూడనిది జరిగిపోయింది. అందరూ ఫోటోలు తీసేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పుస్తకంలోని ఒక పేజీ కూడా జనసేన సోషల్ మీడియా అఫీషియల్ పేజీల్లో వచ్చింది. అది బాధితులు ఏం చెప్పారో లేదా ఏమి చెయ్యాలో రాసుకున్న పేజీ అన్నమాట. సహజంగానే పవన్ కళ్యాణ్ ఏమి రాసుకున్నారన్న ఉత్సుకత అందరికీ వస్తుంది.. ఫోటోను జూమ్ చేసి చూసుకున్నారు. అందులో.. ఉన్నదేమిటంటే.. చీపురుపల్లి, పుచ్చకాయలు, ఐదు ఎకరాలు, బిర్యానీ, పార్వతి, లక్ష , ఇల్లు.. వీటిలో కొన్నింటికి రౌండప్లు…పిచ్చిగీతలు. అర్థం పర్థం లేని మరికొన్ని రాతలు ఉన్నాయి.. ఆ ఫోటోని ఇక్కడ చూడండి..!
సహజంగా..ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఇలాంటి నోట్స్ రాసుకుంటారు ,అది అందరికీ అర్థం కావాల్సిన పని లేదు. కానీ పవన్ రాతలు చూసిన తర్వాత అది మళ్లీ పవన్ చదువుకున్నా కూడా అర్థం కాదనేది లాంగ్వేజ్ ఎక్స్ పర్ట్స్ అంచనా. చూసేవారికి మాత్రం ” అబ్బో మన.. బాధలు స్వయంగా పవన్ గారే రాసుకుంటున్నారు..మనకేదో జరుగుతుంది ” అని భ్రమ కల్పించడానికి తప్ప ఆ పిచ్చి రాతల్లో ఏమీ ఉండదని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ప్రారంభమయ్యాయి
ఈ సందర్భంగా చదువుల్లో వీక్ అయిన విద్యార్థుల మనస్తత్వం గుర్తుకువస్తోంది…పరీక్ష హాల్లో తమకు ఏమీ రాకపోయినా కొందరు అది కప్పి పుచ్చుకోవడానికి అడిషనల్ షీట్లు తీసుకుని తెగ రాసేస్తారు. ఏమి రాసి ఉంటారు ? ఆన్సర్లు రాసి ఉంటారా ? ఆన్సర్లు అనుకుని..ఏది గుర్తొస్తే అది రాసేస్తారు. అది ఎగ్జామ్ హాల్లో ఉన్న వాళ్లెవరికీ తెలియదు. ఎవరూ వాళ్ల పేపర్లోకి చూడరు కాబట్టి..వాళ్లు చాలా మేధావి అనుకుంటా ఉంటారు విషయం తెలియని వాళ్ళు. కానీ దిద్దేవాడికి మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ దిద్దేవాడెవడో వాళ్లకీ తెలియదు. మనకీ తెలియదు. సో .. సేఫ్..ఎగ్జామ్ పోయింది..పోతే పోనీ… ఎక్కడైనా అలాంటి ఎడిషనల్ షీట్లు రాసుకోవచ్చు.
—- సుభాష్