పవన్ కల్యాణ్ – సుజిత్ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘ఓజీ’. ఓ చిన్న టీజర్‌తో ఈ సినిమాపై ఎంతో హైప్ క్రియేట్ చేశారు. పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో దీనిపైనే అందరికీ భారీ అశలూ, అంచనాలూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా చేతులు మారిందని తెలుస్తోంది. వాస్తవానికి డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పీపుల్స్ మీడియా చేతికి వచ్చిందని టాక్. ఈ సినిమా బడ్జెట్ రోజు రోజుకీ పెరుగుతూపోతోంది. పైగా.. పవన్ రాజకీయాల్లో పడి, ఈ సినిమాని పక్కన పెట్టారు. ఓ సినిమా ఆలస్యం అయితే వడ్డీల భారం నిర్మాత మోయాల్సివస్తోంది. ఈ కారణాల దృష్ట్యానే ఈ సినిమాని దానయ్య వదులుకొన్నారా? లేదంటే మరే కారణాలైనా ఉన్నాయా? అనేది తెలియాల్సివుంది. పవన్ కల్యాణ్ తో `బ్రో` తీసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఇప్పుడు పవన్‌తో ఈ సంస్థకు ఇది రెండో సినిమా అవుతుంది. త్వరలోనే నిర్మాణ సంస్థ మార్పుపై ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.