నిన్నమొన్నటివరకూ జయలలిత అనారోగ్యం, ఆస్పత్రిలో చేరిక, అనంతరం మరణం ఫలితంగా ఏర్పడిన రాజకీయ పరిస్థితులతో హాట్ టాపిక్స్ కి వేదికైన తమిళనాడు… తాజాగా జల్లికట్టు వ్యవహారంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెలబ్రెటీలు, సామాన్యులు, విద్యార్థులు, యువకులతో పాటు కొన్ని రాజకీయ శక్తులు అన్నీ రెండు వర్గాలుగా చీలిపోయాయనే అభిప్రాయం తాజాగా వ్యక్తమవుతుంది. వీరిలో జల్లికట్టుకు అనుకూలంగా, పెటాకు వ్యతిరేకంగా స్పందించేవారు ఒకరైతే… జల్లికట్టు అనే విషయం ఏమాత్రం మంచి పద్దతి కాదనే వారు మరొకరు. ఈ క్రమంలో తాజాగ ఈ విషయంపై స్పందించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తిస్తున్న జల్లికట్టుపై తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంలో తమిళ జల్లికట్టు తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగే కోడిపందాలపై కూడా పవన్ రియాక్టయ్యారు. జల్లికట్టు, కోడి పందాలు వంటి సంప్రదాయ విషయాలపై నిషేధం విధించడం దక్షిణ భారత సంస్కృతిపై దాడి చేయడమేనని తాజాగా ట్విట్టర్ లో పవన్ మండిపడ్డారు. ఈ విషయంలో మరింత సీరియస్ గా స్పందించిన పవన్… జల్లికట్టు – కోడిపందాలపై నిషేధం అనే చర్య ద్రావిడ సంస్కృతిపై కేంద్ర ప్రభుత్వం కత్తిగట్టినట్లుగా భావించాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రమైన తమిళుల ఆకాంక్షను అణిచివేసిన నేపథ్యంలో తను తెలుగువాడిని అయినప్పటికీ స్పందించాల్సి వస్తోందని పవన్ పేర్కొన్నారు.
ఇదే క్రమంలో ట్విట్టర్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసిన పవన్ తన వ్యక్తిగత గోశాలలో సుమారు 16కి పైగా ఆవులు, గేదులు ఉన్నాయని తెలిపారు. అలాగే సంప్రాదాయాలన్నా, జంతువులన్నా, మాతృభూమి అన్నా తనకెంతో మమకారం, అలాగే గౌరవం ఉందని పవన్ తెలిపారు. ఇందులో భాగంగానే తన ఫార్మ్ హౌస్ లో ప్రకృతి వ్యవసాయం రూపంలో జీవామృతంతో సాగు చేస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే కోడిపందాలు – జల్లికట్టుపై స్పందించాలనే భావన తనకు కలిగిందని పవన్ వివరించారు.
#Jallikattu #Kodipandem pic.twitter.com/gvpWrGtoFO
— Pawan Kalyan (@PawanKalyan) January 20, 2017
#Jallikattu #Kodipandem pic.twitter.com/WIQRaC5pAZ
— Pawan Kalyan (@PawanKalyan) January 20, 2017
#jallikattu #kodipandem pic.twitter.com/BVh026xE54
— Pawan Kalyan (@PawanKalyan) January 20, 2017
#Jallikattu#Kodipandem pic.twitter.com/NH3oeXw2sz
— Pawan Kalyan (@PawanKalyan) January 20, 2017
Looking at the cows & roosters in my farm made me to think about the Ban of #jallikattu & #kodipandem in Dakshin Bharath.
— Pawan Kalyan (@PawanKalyan) January 20, 2017