గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ ఫంక్షన్ అదిరిపోయింది. బాహుబలి సెంటిమెంట్‌ని దృష్టిలో పెట్టుకుని గౌతమీ పుత్రుడి పాటలను కూడా తిరుపతిలోనే రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నది కూడా టిడిపి ప్రభుత్వమే కావడంతో పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం కూడా భారీగానే సపోర్ట్ అందించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో సహా పొలిటికల్ బలగం కూడా బాగానే కనిపించింది. మరి ఇప్పుడు ‘గౌతమీ..’ స్పీడ్ తట్టుకోవాలంటే మెగాస్టార్ చిరంజీవి ఏం చేయాలి? పైగా థియేటర్స్ విషయంలో కూడా సింగిల్ స్క్రీన్స్ విషయంలో రాజకీయ పలుకుబడి ఉపయోగించి మరీ బాలకృష్ణ సినిమాకు ఎక్కువ సంఖ్యలో కేటాయిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అన్నింటికీ మించి గౌతమీ పుత్ర శాతకర్ణి ట్రైటర్ రిలీజ్ అయిన తర్వాత నుంచీ సినిమాపైన అంచనాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కంచె సినిమాతో ఈ తరహా సినిమాలను కూడా తెరకెక్కించగలను అని ప్రూవ్ చేసుకున్న క్రిష్ ఈ సారి గౌతమీని అంతకు ఎన్నో రెట్లు మించి అనే స్థాయిలో తెరకెక్కించి ఉంటాడన్న నమ్మకం రోజు రోజుకూ పెరుగుతోంది. పైగా డైరెక్టర్ క్రిష్ కూడా పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు.
మరోవైపు ఖైదీ నంబర్ 150 సినిమాకు వచ్చేసరికి గౌతమీ పుత్రుడి సినిమాకు ఉన్న ప్రత్యేకతలు లేకుండా పోయాయి. పైగా ‘అఖిల్ సినిమాతో నాగార్జున, అఖిల్‌లకు పీడకలను మిగిల్చిన వి.వి.వినాయక్ సామర్థ్యంపైన కూడా అనుమానాలున్నాయి. టీజర్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. దశాబ్ధం తర్వాత మెగాస్టార్ తెరపైన కనిపిస్తూ ఉండడం, అది కూడా దశాబ్ధం క్రితం వచ్చిన ఇంద్ర సినిమాలో ఎలా కనిపించాడో అదే గ్లామర్, అదే ఫిజిక్‌తో కనిపిస్తుండడం ఒక్కటే ఫ్యాన్స్‌ని ఖుసీ చేస్తోంది. కానీ గౌతమీ పుత్రుడి స్పీడ్‌కి బ్రేకులు పడాలంటే ఇంకేదో మేజిక్ కూడా కావాలని అనిపిస్తోంది. ఆ మేజిక్ కూడా చిరంజీవి ఇంట్లోనే ఉంది. అదే పవర్ స్టార్ పవర్. ఖైదీ ప్రి రిలీజ్ ఫంక్షన్‌కి పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వాలి. అలాగే ఏదో మొహమాటం కోసం మాట్లాడినట్టుగా కాకుండా చిరంజీవి గురించి, 150వ సినిమా గురించి ఓ పది నిమిషాల స్పీచ్ ఇస్తే చాలు. గౌతమీ పుత్రుడి ఆడియో వేదికపైన కనిపించిన రాజకీయ బలగం కంటే ఎన్నో రెట్ల బలం ఖైదీకి వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు బన్నీ, వరుణ్ తేజ్, సాయిధరమ్, రామ్ చరణ్‌లు కూడా ఉంటారు కాబట్టి మెగా ఫ్యాన్స్‌తో పాటు, తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ కూడా ఓ మెమొరబుల్ ఈవెంట్‌గా ఖైదీ ఫంక్షన్ నిలిచిపోవడం ఖాయం. దాదాపుగా క్రికెట్ టీం అంతమంది హీరోలు ఒకే వేదికపై ఒకేసారి కనిపించడం అంటే మాటలా. అయితే ఈ అద్భుతం జరగాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ హాజరు పక్కాగా ఉండాలి. మెగా ఫ్యామిలీలో ఉన్న మిగతా హీరోలందరూ ఒక లెక్క…….పవర్ స్టార్ ఒక్కడు ఒక లెక్క. మరి తన దేవుడు చిరంజీవి అని ఎన్నోసార్లు చెప్పిన పవన్ ఈ ‘ఖైదీ నంబర్ 150’ సినిమాకి సపోర్ట్ ఇస్తాడా? కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా వస్తున్న ఈ మొదటి సినిమాకి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా చేయూత అందిస్తాడా?