తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో పవన్ కల్యాణ్ తొలి సారి బయట పడ్డారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు పదే పదే కలిసి రావాలని పవన్ కల్యాణ్‌కు పిలుపునిచ్చారు. కానీ తాను గెలవకపోయినా పర్వాలేదు… టీడీపీని ఓడిస్తానని చాలెంజ్ చేసి .. కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని పోీట చేశారు. కానీ చివరికి ఆయన కూడా గెలవలేదు. ఇప్పుడు టీడీపీతో పొత్తు విషయంలో ఆయనే కాస్త తగ్గి మాట్లాడుతున్నారు. మంగళగిరిలో జనసేన ఆఫీసులో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మహానాడుకు ముందు టీడీపీ.. చంద్రబాబు జనసేన విషయంలో వన్ సైడ్ లవ్ అన్నట్లుగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మాత్రం వార్ వన్ సైడ్ అంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కల్యాణ భిన్నంగా స్పందించారు. చంద్రబాబు మొన్నటిదాకా వన్ సైడ్ లవ్ అన్నారు .. ఈ మధ్య వార్ వన్ సైడ్ అన్నారని ముందు చంద్రబాబుకు ఓ క్లారిటీ వచ్చాక పొత్తులపై మాట్లాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఏపీ రాజకీయాల్లో పొత్తులపై చర్చలు జరుగుతున్న సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. చంద్రబాబు సిద్ధం అంటే.. పవన్ కల్యాణ్ కూడా రెడీ అన్నట్లుగా మాట్లాడటంతో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాను సీఎం అభ్యర్థి అని బీజేపీ చెప్పలేదని.. కరోనా కారణంగానే బీజేపీ తో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నానని చెప్పారు. జేపీ నడ్డా మీటింగ్ లకు కూడా హాజరు కాలేనని స్పష్టం చేశారు. బీజేపీతో చెడిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 2014, 2019 లో తగ్గాను కానీ 2024లో తగ్గటానికి సిద్ధంగా లేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ సారి మిగతా వాళ్లు తగ్గితే బాగుంటుందన్నారు. ఈ మాత్రం చాన్స్ ఇస్తే చంద్రబాబు ఎలాగూ … పొత్తుల కోసం రెడీగా ఉంటారు కాబట్టి… అడుగులు ముందుకు పడతాయని భావిస్తున్నారు.