పవన్ కళ్యాణ్ యాత్ర మొదలైంది వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ చాలా చాలా విషయాల గురించి మాట్లాడారు అందులో భాగంగా 2014లో జగన్ పార్టీకి తాను ఎందుకు ఇవ్వలేదు అన్న విషయాన్ని వివరించారు
తాను జనసేన స్థాపించిన తర్వాత 2014 ఎన్నికల్లో జగన్ పార్టీకి మద్దతు ఇవ్వకపోవడానికి కారణం వివరిస్తూ తండ్రి చనిపోగానే జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తనకు నచ్చలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు పైగా జగన్ పైన ఉన్న అవినీతి అభియోగాలను ప్రస్తావిస్తూ తెలుగులో యథారాజా తథాప్రజా అని ఒక సామెత ఉందని పాలకుడు అవినీతి పరుడైతే ఆ ప్రభావం తప్పకుండా ప్రజలపై కూడా ఉంటుందని పవన్ చెప్పారు అలాంటి ప్రభావం ఉండటం భావితరాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని జనసేన అధినేత చెప్పారు.
రాజకీయ పార్టీలు ఒక పొరపాటు చేస్తే ఆ ప్రభావం దశాబ్దాల తర్వాత కూడా ప్రజలపై ఉంటుందని ఆయన వివరించారు మూడు దశాబ్దాల క్రితం ఆంధ్ర ఉద్యమం జరిగిన సమయంలో నాయకులు చేసిన పొరపాట్ల వల్ల ఇవాళ బాసరలో విద్యార్థులు స్కాలర్ షిప్ ల విషయంలో నష్టపోతున్నారని అప్పుడు చేసిన పొరపాటు వల్ల ఇప్పటి తరాలు ఫలితాన్ని అనుభవిస్తున్నారని పవన్ అన్నారు
ఇలా అనేక విషయాలు ఆలోచించే జగన్ కు మద్దతు ఇవ్వకూడదు అని నిర్ణయాన్ని తాను తీసుకున్నట్టు వెల్లడించారు