ప.గో. జిల్లాలో ఒక పార్క్ విషయమై రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. కొంత కాలం క్రితం ఆర్ అండ్ బీ అధికారులు ఒక పార్క్ స్థలాన్ని ఒక వర్గానికి కేటాయించారు. వారు దీన్ని పవన్ కళ్యాణ్ పార్క్ గా ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. అయితే పక్కనే హరిజన వాడ ఉండటం తో దీన్ని అంబేద్కర్ పార్క్ గా ఏర్పాటు చేయాలని ప్రయత్ని మరికొందరు ప్రయత్నించారు. ఇక దాంతో గొడవ మొదలవడం తో అంబేద్కర్ ఫ్లెక్సీలు, పవన్ ఫ్లెక్సీలు పోటాపోటీగా వెలిసాయి పార్క్ ప్రాంతం లో . దీంతో మాటా మాటా పెరిగి గొడ పెద్దదై కొట్టుకునే వరకు వచ్చింది.
అయితే ఇక్కడ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు ప్రజలు. ప్రభుత్వ భూమి ని ఒక వర్గానికి ఇవ్వడం ఎందుకని ఒక పార్క్ గా వారే ఏర్పాటు చేసి ఉంటే అందరూ దాన్ని వినియోగించుకునే వారనీ అందరూ అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం సకాలం లో స్పందించి, గొడవ పెద్దది కాకుండా కంట్రోల్ చేయగలిగారు. సెన్సిటివ్ ఇష్యూ కావడం తో ఎవరెవరు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.