సర్దార్ డిజాస్టర్‌తో తలలు పట్టుకొన్నారు బయ్యర్లు. నిర్మాత శరత్ మరార్ కూడా భారీగా నష్టపోయాడు. ఆ నష్టాన్ని వీలైనంత పూడుద్దామని బరిలోకి దిగాడు పవన్ కల్యాణ్. అందుకే సూర్య సినిమాని వీలైనంత త్వరగా.. తక్కువ ఖర్చులో ఫినిష్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాడు. సాధారణంగా సినిమా సినిమాకీ మధ్య గ్యాప్ తీసుకొనే పవన్, అలాంటి విరామం ఏమీ లేకుండా అతి తొందర్లోనే కొత్త సినిమాని మొదలెట్టేద్దామని ఫిక్సయ్యాడు. జూన్ 10న పొలాచ్చీలో పవన్ సినిమా మొదలవ్వబోతోంది. నవంబరులోగా ఈ సినిమాని పూర్తి చేసి, డిసెంబరులో రిలీజ్ చేయాలన్నది పవన్ ప్లాన్.
ఎందుకంటే 2019 ఎలక్షన్లలో పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతున్నాడు. ఈలోగా వీలైనన్ని సినిమాలు పూర్తి చేయాలన్న ధ్యేయంతో ఉన్నాడు. దానికి తోడు సినిమా ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీలు పెరుగుతూ, బడ్జెట్ తడిసిమోపెడవుతుంది. అందుకే.. సూర్య సినిమాని ఇంచుమించుగా చుట్టేద్దామన్నరీతిలో ఫిక్సవుతున్నాడు పవన్. కంటెంట్ బాగుంటే.. క్వాలిటీ తగ్గినా ఫర్వాలేదు.. అంటూ పవన్ నిర్మాత భుజం తడుతున్నాడట. పవన్ సినిమా అంటే దాదాపు రూ.40 నుంచి రూ.50 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఈ సినిమాని మాత్రం సగంలో పూర్తి చేయాలనుకొంటున్నట్టు టాక్. ఈ పొదుపు మంత్రమేదో సర్దార్ విషయంలో జపించి ఉంటే, అన్ని భారీ నష్టాలొచ్చేవి కావు, ఇప్పుడు ఈ సినిమానిచ చుట్టాల్సిన అవసరమూ ఏర్పడేది కాదు. ఆ జాగ్రత్త ఏదో ముందుండాలి.