ఏపీలో అసెంబ్లీని రద్దు చేయకపోయినా జరుగుతున్నా ..ఎన్నికల సన్నాహాలు జరుగుతున్న తీరుతో తెలంగాణతో పాటు డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకానికి రాజకీయ పార్టీలు వస్తున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా తమ పార్టీ నేతలకు అదే చెప్పారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జరిగిన నేతల సమావేశంలో ఇది ఎన్నికల సంవత్సరంలా కనిపిస్తోంది, ఏపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల సంకేతాలను పార్టీ నేతలు దృష్టిలో పెట్టుకోవాలని నడుచుకోవాలన్నారు.
నా చుట్టూ తిరిగితే నాయకులు కాలేరు. ఏరోజూ కూడా సీట్ల కోసం ఎవ్వరి నుంచి ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోలేదని జనసేనాని స్పష్టం చేశారు. ఒకవేశ సీటు కోసం ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే ఇది మీ తప్పిదమే అని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ఇటీవల ఒకరు తన మనిషి అని చెప్పి, పవన్ తో ఫోటో తీయిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఇలాంటివి ప్రోత్సహించకూడదని, వీటిని మొగ్గ దశలోనే తుంచివేయడం మంచిదన్నారు.సీఎం జగన్ పాలన ఎలా ఉందంటే.. రాజకీయం అంటే భయపెట్టడం, బెదిరించడం అనేలా ఉందన్నారు. రాజకీయం అంటే బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. జగన్ అనే అరాచకశక్తిపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన శ్రేణులకు ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు.
న్యాయమార్గంలో ఎవరూ ఉండకూడదు, ఒకవేళ న్యాయంగా డబ్బు సంపాదించినా జనాలు మాట్లాడకూడదు, కామ్ గా కూర్చోవాలి అనే తీరుగా సీఎం జగన్ పాలన ఉందని విమర్శించారు. గతంలో రాజకీయాలపై ఏదో మూల ప్రజల్లో భయం ఉన్నా, ఇప్పుడు వైసీపీ దాన్ని పరిపూర్ణం చేసిందంటూ సెటైర్లు వేశారు. తనకు అపారమైన జనాధరణ ఉందని, తెలంగాణలోనూ పార్టీ నడుపుతున్నాం కానీ అక్కడ ఇబ్బంది కలగలేదన్నారు. కానీ ఏపీలోనే జనసేనను ఎదుర్కొనేందుకు, ఇబ్బందులు పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదన్నారు. త్యాగం, బాధ్యత, విలువలు, జవాబుదారీతనం ఉన్నవారి వెంట ప్రజలు నడుస్తారని పవన్ చెప్పారు.