జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ బీజేపీ నేతలను సమయం చూసి ఝులక్ ఇచ్చారు. ఓ వైపు ఎమ్మెల్సీఎన్నికల పోలింగ్ జరుగుతూండగా.. తెలంగాణ బీజేపీ నేతలకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లోఅభ్యర్థులను నిలబెట్టిన తర్వాత కూడా ఉపసంహరించుకుని మద్దతు పలికితే… తమను అమానించారని మండిపడ్డారు. దీంతో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు వర్గీయులు షాక్ కు గురయ్యారు. పవన్ కల్యాణ్ ఓ వైపు ఎమ్మెల్సీ పోలింగ్.. మరో వైపు ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతూండగా.. అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చారు . సామాన్యంగా ఇలాంటి సందర్బాల్లోముఖ్య నేతలు ప్రెస్మీట్లు పెట్టరు .
కానీ బీజేపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసేందుకా అన్నట్లుగా పవన్ మాట్లాడిన మాటలు రాజాకీయంగా కలకలం రేపుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా జనసేన అభ్యర్థుల్ని ఉపసంహరించిన తర్వాత పలువురు తెలంగాణ నేతలు.. పవన్ పై తేలిక కామెంట్లు చేశారు. తాము మద్దతు అడగలేదని..పవన్ వచ్చి ఇచ్చారన్నారు. తెలంగాణలో తమకు ఎవరితోనూ పొత్తు లేదని తేల్చేశారు. పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో బ లమేం లేదని కూడా వ్యాఖ్యానించారు. ఈ మాటలన్నీ ఆషామాషీ నేతలన్నవి కాదు. ప్రస్తుతం తెలంగాణలో చక్రం తిప్పుతున్న బీజేపీ నేతలు చేసిన విమర్శలే. అరవింద్, డీకేఅరుణ , బండి సంజయ్ లాంటి వారందరూ తలాఓ మాట అన్నారు. ఆ సమయంలో సైలెంట్ గా ఉన్న పవన్ కల్యణ్ ఇప్పుడు ఎమ్మెల్సీఎన్నికలు తాడో పేడో అన్నట్లుగా సాగుతున్న సమయంలో షాకిచ్చారు.
పవన్ మాటలు టీఆర్ఎస్కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ప్రతీ ఓటు కీలకం అనుకుంటున్న సమయంలో పవన్ కల్యాణ్ ఝులక్ ఇవ్వడంతో.. బీజేపీ నేతలకు షాకిచ్చినట్లయింది. రాజకీయాల్లో ఎవర్నీ వ్యతిరేకం చేసుకోకూడదు. మిత్రులగాఉన్న వారిపై ఎప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. ఈ సూత్రాన్ని విస్మరించి బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయడంతో పరిస్థితి మారిపోయింది. రేపు ఫలితాల్లో స్వల్ప ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓడిపోతే…తప్పు చేశామని.. వాళ్లే నాలిక కరుచుకోవాల్సి వస్తుంది.