జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విస్ట్స్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు. తన పార్టీకి సంబంధించిన వ్యక్తితో ఇటీవలే 99tv కొనుగోలు అలా చేయడమే కాకుండా మరో రెండు చానళ్లకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ఇప్పటికే రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు త్వరలోనే ఒక జాతీయ చానల్లో సామాజిక సమస్యలపై పవన్ కళ్యాణ్ ఒక ప్రోగ్రాం చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో అమీర్ ఖాన్ సత్యమేవ జయతే అనే ప్రోగ్రాం ఇలాగే సామాజిక సమస్యలపై నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న ప్రోగ్రామ్ కూడా ఇలాగే మరికొన్ని సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
షో గురించిన వివరాలు: ఆంధ్రప్రదేశ్‌కు చెందినటువంటి పారిశ్రామికవేత్త ఇటీవల ప్రారంభించిన జాతీయ ఛానల్లో ఈ ప్రోగ్రాం రానున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లీష్ మరియు హిందీలలో ఈ ప్రోగ్రాం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఉద్దానం కిడ్నీ సమస్య, ప్రకాశం జిల్లా లోని ఫ్లోరైడ్ సమస్య, వెనుకబడిన జిల్లాల లోని ఆరోగ్య మరియు విద్య సంబంధించిన సమస్యలు ఈ ప్రోగ్రాం లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని సమస్యల గురించి చర్చించడానికి కావలసిన రీసెర్చ్ పనిలో జనసేన సోషల్ మీడియా విభాగం బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విభాగం అమీర్ ఖాన్ కి సంబంధించిన సత్యమేవ జయతే ప్రోగ్రాం నిర్వాహకులతో టచ్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ షో ఎన్ని వారాల పాటు కొనసాగనుంది ఒక్కొక్క ఎపిసోడ్ ఎంత నిడివి కలిగి ఉంటుంది లాంటి అంశాలపై తుది నిర్ణయం ఇంకా తీసుకోవలసి ఉన్నట్టు తెలుస్తోంది.
ఇటీవలే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా విభాగం కోసం ఒక పెద్ద ఐటి బిల్డింగ్ ని ప్రారంభించారు. దాదాపు 800 మంది ఇందులో పని చేయనున్నారని వార్తలు రాగానే కొంతమంది ఈ ఐటీ వింగ్ కేవలం ప్రత్యర్థి పార్టీల మీద ట్రోలింగ్ చేయడానికి ఏర్పాటు చేసి ఉంటారని ఇది మంచి పరిణామం కాదని విమర్శలు చేశారు. అయితే ఈ విభాగం ప్రారంభించింది అలాంటి చీప్ ట్రిక్స్ కోసం కాదని, ఇటువంటి మరెన్నో ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడానికి రీసెర్చ్ చేయడానికి అని ఈ పరిణామాల ద్వారా అర్థమవుతోంది.
ఇక రాజకీయంగా కూడా ఇది జనసేనకు లాభించవచ్చు. జాతీయస్థాయిలో పార్టీ ఉనికి చాటుకోవడానికి ఇది ఉపయోగపడడమే కాకుండా ఈ ప్రోగ్రామ్ ద్వారా వాటిలో జరిగే చర్చ ద్వారా వీటిలో ఏ ఒక్క సమస్యకు అయినా పరిష్కారం దిశగా ముందడుగు పెడితే దాని వల్ల లభించే మైలేజ్ కూడా పార్టీకి బాగానే ఉండవచ్చు. అయితే ఒకే ఒక్క ప్రతికూల అంశం ఏమి కనిపిస్తుంది అంటే ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రాం పేరుమోసిన ఛానల్ లో కాకుండా ఒక కొత్త చానల్లో రావడం దానికి ఎంత వ్యూయర్ షిప్ ఉంది అనేది తెలియని చానల్లో రావడం ద్వారా ఇది ఎంత మంది వరకు రీచ్ అవుతుంది అనేది కొంచెం సందేహమే.
ఏదిఏమైనా ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా దశాబ్దాల తరబడి పరిష్కారం కానటువంటి ఉద్దానం కిడ్నీ సమస్య ప్రకాశం ఫ్లోరైడ్ సమస్య ఇలాంటి వాటిపై జాతీయ స్థాయిలో కి తీసుకు వెళ్లడం వాటి పరిష్కారానికి చర్చలు చేయడం స్వాగతించవలసిన అంశమే.