ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేతలే అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించారని…. ప్రజారాజ్యం ఉండి ఉంటే ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు రైతుభరోసా యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వంలో రెడ్లకు మాత్రమే మేలు జరుగుతోందన్న అభిప్రాయం ఉందని.. కానీ వారికీ మేలు జరగడం లేదన్నారు.
కడప జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల్లో అత్యధికులు రెడ్లేనన్నారు. ప్రభుత్వం వారికి సాయం చేయకపోవడం వల్లనే తాను చేస్తున్నాన్నారు. పద్యం పుట్టిన ప్రాంతంలో మద్ం ఏరులైపారుతోందన్నారు. ఇంటికో ఉద్యోగం రాలేదు కానీ ఇంటింటికి చీప్ లిక్కర్ వస్తోందని యువత చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధులు సంచరించిన ప్రాంతంలో పేదరికం తాండవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వ్యక్తులపై పోరాటం చేయనని.. భావాలపైనే చేస్తాన్నారు. ఎవరి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం చేాయలన్నారు. అలా చేయకపోతే ఎంత చదువుకుంటే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. పేదరికానికి కులం ఉండదని గుర్తు చేశారు. కుల రాజకీయాల కోసం తాను జనసేన పార్టీని స్థాపించలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వాటి గురించి తాను ఆలోచించనన్నారు.
వారసత్వ రాజకీయాలకు కొంత మేరకైనా అడ్డుకట్ట వేయాల్సి ఉందని పవన్ వ్యాఖ్యానించారు. కుల, మతాలతో రాజకీయం చేస్తే దేశం విచ్చిన్నం అవుతుందన్నారు. అన్న పట్టించుకోకపోవడంతోనే చెల్లెలు వేరే రా,్ట్రంలో పార్టీ పెట్టారని గుర్తు చేసారు. రాయలసీమలో బడుగు, బలహీన వర్గాల గురించి ఎవరూ ఆలోచించలేదన్నారు. అన్నికుల్లాలో పేదలున్నారని గుర్తు చేశారు. కులం, మతం, ప్రాంతం దాటి వచ్చిన మనిషిని తానని పవన్ కల్యాణ్ ప్రకటించుకున్నారు.