వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పవన్ కు హఠాత్తుగా ప్రభుత్వంపై ఇంత తీవ్రమై కోపం రావడానికి కారణం సాక్షిలో ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనలే. ఓ వైపు వరదలు వస్తూంటే ప్రభుత్వం.. “వస్తుంది.. పోతుంది” అన్న పాలసీలో ఉంది. కనీసం కంట్రోల్ రూమ్ కూడా పెట్టకుండా సహాయ చర్యలు గుడ్డిలో మెల్లగా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఇంకా బెటర్ పనితీరును ఆశిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన పత్రిలో ఇసుక అమ్ముతామంటూ ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు.
వరద కష్టాలు ప్రధాన పత్రికల మొదటి పేజీల్లో కనబడకూడదన్నట్లుగా వ్యూహం అని కొంత మంది అనుకుంటున్నారు. మరో వైపు సీఎం పెళ్లిళ్లలకు తిరుగుతున్నారు కానీ..సొంత జిల్లాలో వరద దుస్థితిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధం లేని పత్రికా ప్రకటనలు.. వరదల వద్ద పెద్ద ఎత్తున ఇసుక వచ్చి ఉంటుంది కాబట్టి దాన్ని అమ్ముతమని చేస్తున్న ప్రకటనలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఓ రకమైన అసహ్యాన్ని కలిగిస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా అలాగే అనిపించింది. అందుకే మనసులో దాచుకోకుండా ప్రభుత్వంపై మండిపడ్డారు. పవన్ కు వచ్చినట్లుగానే దాదాపుగా రాష్ట్రంలోని ప్రజంలదరికీ డౌట్ వచ్చింది. జీవితాలను సర్వశానసం చేసినా సరే జగనే దేవుడు అనుకునే అతి కొద్ది మంది మినహా అందరికీ … ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా అనే డౌట్ వస్తుంది. దాన్ని తన ట్వీట్లో పవన్ కల్యాణ్ వ్యక్తీకరించారు.