ఇటీవల జగన్ రెడ్డి గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తున్నట్లుగా ఓ పెయింటింగ్ వేయించుకున్నారు. గాంధీ, జగన్ అనే మాటలు వింటే చాలా మందికి కంపరం పుడుతుంది. అయినా సరే పోస్టర్లు వేసుకున్నారు. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం తీసుకు వచ్చారని. పంచాయతీల్ని నిర్వీర్యం చేసి.. సర్పంచ్ ల అధికారాల్ని లేపేసి… నిధులన్నీ ఊడ్చేసి…. పాడి పరిశ్రమను గుజరాత్ కు తాకట్టుపెట్టేసి… ఏం గాంధీ గారి ఆశయాలు సాధిస్తున్నారో తెలియాల్సి ఉంది. ముఖ్యంగా పంచాయతీల్ని నిర్వీర్యం చేసేలా తెచ్చిన సచివాలయాల గురించి అనేక సందేహాలు ఉన్నాయి.
గ్రామ, వార్డు సచివాలయాలకు కూడా చట్టబద్ధత లేదు. ఆర్డినెన్స్ తెచ్చారు కానీ చట్టం చేయలేదు. దాంతో అది ఎక్స్ పైర్ అయిపోయింది. ఎందుకంటే.. పంచాయతీల విధులను… గ్రామ, వార్డు సచివాలయాలకు ఎలా ఇస్తారనేది కీలకం. అసలు పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడమే రాజ్యాంగపరమైన తప్పిదం. కానీ.. ప్రభుత్వం ఎలాంటి అడ్డగోలు పనులు చేయడమే పాలనగా పెట్టుకుంది. వ్యవస్థలు బలహీనంగా మారి.. .. చూసీ చూడనట్లుగా పోతున్నాయి.
పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థతో పాటు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థనూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పాల్సి ఉంది. పంచాయతీల్ని కాకుండా సచివాలయాల్ని ఎందుకు పెట్టారు… ఏ చట్టంప్రకారం పెట్టారు.. వాటిలో ఉన్న ఉద్యోగులకు చట్టబద్దత ఏంటి.. ఇవన్నీ చెప్పాల్సి ఉంది. చట్ట విరుద్ధమైన వ్యవస్థ పెట్టి ఇంత కాలం నడిపితే…. దాన్ని నియంత్రించలేని ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా ప్రమాదం