రచయిత విజయేంద్ర ప్రసాద్ కి పవన్ కళ్యాణ్ కంటే ప్రత్యేకమైన అభిమానం. బాహుబలి ఇంటర్వెల్ సీన్ కి పవన్ కళ్యాణే స్ఫూర్తి చాలా సందర్భాల్లో చెప్పారాయన. పవన్ కళ్యాణ్ కోసం ఇప్పుడాయన ఓ కథ రెడీ చేశారు. పవన్ కళ్యాణ్ కు సరిపడే కథల కోసం చాలా మంది దర్శక, నిర్మాతలు అన్వేషిస్తున్నారు. ఎవరికైనా ఈకథ ఇచ్చేవచ్చు. ఐతే విజయేంద్ర ప్రసాద్ మాత్రం తన కథని రాజమౌళినే దర్శకత్వం వహించాలని, రాజమౌళి అయితేనే తన కథకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.
రాజమౌళికి కూడా పవన్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ ఎప్పటి నుండో ఆయనకీ వుంది. ఐతే అది కుదరలేదు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ కథతో సిద్ధంగా వున్నారు. ఐతే రాజమౌళి ఇప్పుడు మహేష్ సినిమాతో సినిమా చేయాలి. అది పూర్తయినప్పటికీ కనీసం రెండేళ్ళయినా పడుతుంది. ఈలోగ విజేయంద్ర ప్రసాద్ తయారుచేసుకున్న కథ వేరే దర్శకుడికి ఇస్తే మాత్రం త్వరగానే సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది. ఐతే ఈ కథ వేరే వాళ్లకి ఇచ్చే అవకాశం తక్కువ. రాజమౌళినే చేయాలనే పట్టుదలతో వున్నారు విజయేంద్ర ప్రసాద్. మరి పరిస్థితులు అప్పటికి ఎలా మారుతాయో చూడాలి.