జగన్ కోడి కత్తి ఎపిసోడ్లో… పవన్ కల్యాణ్‌పైనా ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు చేశారు. కానీ… పవన్ కల్యాణ్ ట్విట్టర్లో చాలా సింపుల్‌గా వివరించారు. ఒకే ఒక్క మాటతో… తన రియాక్షన్ చెప్పారు. ” ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు ..ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి గారు అయన వర్గీయులు మా మీద పడి ఏడుస్తారు ఎందుకు?” .. చంద్రబాబు.. సంబంధం లేకపోయినా.. తనను విమర్శించారనే ఆవేదన పవన్ కల్యాణ్‌కు ఉందని ఈ ట్వీట్ ద్వారా తెలుస్తుంది. కానీ ఆయనను ఆయన చిన్న బుచ్చుకున్నారని.. ఆ వాడిన సామెతని బట్టి అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రెండు లక్షల పుస్తకాలు చదివారంటారు. అందులో .. ఎన్నో తెలుగు సాహిత్య పుస్తకాలు ఉండి ఉండవచ్చు. ఆ పుస్తకాల్లో ఎక్కడో.. ఈ సామెత తగిలి ఉండవచ్చు. ఇప్పుడు సందర్భోచితంగా ఉంది కదా..అని వాడుకుని ఉండవచ్చు. కానీ.. ఇది తనకు తాను అన్వయించుకోవడం మాత్రం కరెక్ట్ కాదు.
ఇదీ ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు సామెత అర్థం… మంగలం అంటే ఏమిటో పట్టణాలలో ఉండే వారికి తెలియకపోవచ్చు, కానీ గ్రామాలలో ఉండేవారికి తెలుసు. సాధారణంగా ఒక పాత కుండను ( ఓటికుండ, కొంచం పగులిచ్చిన కుండ ) తీసుకుని దానికి ప్రక్కన చేయి పట్టేంత రంధ్రం చేస్తారు.ఈ రంధ్రంతో కుండ ఇంకా బలహీనమౌతుంది. దీనినే మంగలం అంటారు. మంగలంలో ఎండు మిరపకాయలు, పేలాలు లాంటివి వేయించుతారు. ఇలా మంగలం దాదాపుగా అత్యంత బలహీనమైన వస్తువు అవుతుంది. అత్యంత శక్తివంతమైన ఉరుము అంటే మంగలం మీద పడితే, నష్టం ఏమి లేదు. కేవలం పోయేది ఒటి కుండే. బలవంతుడు బలహీనుడి మీద తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఈ సామెత వాడతారు.
ఇక్కడ చంద్రబాబు.. బలవంతుడే… కానీ.. పవన్ కల్యాణ్ అంత బలహీనుడా..? ఓటి కుండ అంత బలహీనుడా..? తనే స్వయంగా సామెత ద్వారా చెప్పుకున్నాడా..? లేక సామెతను అర్తం చేసుకోలేక చెప్పాడా..? . పవన్ కల్యాణ్.. మంగలంమే అయితే… జనసేన పరిస్థితిని ఏమిటి..?. ఇవన్నీ.. ఈ ట్వీట్ చూసిన వారికి వచ్చిన సందేహాలు. అంతే కాదు… ఆయన ఫ్యాన్స్ కూడా అలాగే ఉన్నారు. ఆయన అలా ట్వీట్ పెట్టగానే.. ఇలా.. గొప్ప సామెత.. అన్నా.. అద్భుతంగా పెట్టేశావ్ అని రీట్వీట్లు.. కామెంట్లు చేస్తున్నారు. పాపం.. వాళ్లకు కూడా తెలియదు కావొచ్చు.. వాళ్లు పొగుతున్నారని అనుకున్నారు కానీ.. నిజానికి కించ పరుస్తున్నారని.. అర్థం కాలేదు. .. !
My response for Sri CBN’s comments on us: ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు’ ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి గారు అయన వర్గీయులు మా మీద పడి ఏడుస్తారు ఎందుకు?
— Pawan Kalyan (@PawanKalyan) October 25, 2018