యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా… పూర్తి స్థాయిలో పోరాడాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పాదయాత్ర చేస్తానని… జనాల కన్నీళ్లు తుడుస్తానని ప్రకటించారు. నల్లమల యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగినరౌండ్ టేబుల్ సమావేశంలో… ప్రభుత్వం… మాయ మాటలు చెబుతోందని.. యూరేనియం తవ్వకానికే సిద్దమవుతున్నారని నిర్ధారణకు వచ్చారు. పోరాట కార్యాచరణ కూడా చర్చించారు. ఈ క్రమంలో పాదయాత్ర అంశం… ప్రస్తావనకు వచ్చింది. నల్లమల గ్రామాల్లో.. పాదయాత్ర చేయాలని … ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కూడా.. పాదయాత్రకు రెడీ అన్నారు.
నిజానికి పవన్ కల్యాణ్ పాదయాత్ర విషయంలో చాలా కాలంగా ఆసక్తితో ఉన్నారు. అనంతపురం కరువు నుంచి ప్రజలను రక్షించడానికి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. కానీ అప్పట్లో.. రాజకీయ కార్యాచరణ స్పష్టంగా లేకపోవడంతో.. పాదయాత్రను చేపట్టలేకపోయారు. చివరిలో బస్సు యాత్ర చేసినా.. అది అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ముంచుకొచ్చిన ఎన్నికలు.. ప్రణాళిక లేకపోవడంతో… సమగ్రంగా యాత్ర చేయలేకపోయారు. కానీ పవన్ కల్యాణ్ ఈ సారి మాత్రం.. ఓ స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పోరాడటానికి ఓ సమస్య కూడా.. ఎదురుగా కనిపిస్తోంది.
యూరేనియం వల్ల నష్టపోయే ప్రాంతాల్లో మొదటగా పవన్ కల్యాణ్ పాదయాత్ర చేపట్టే అవకాశం ఉంది. తెలంగాణలోని నల్లమలతో పాటు.. ఏపీలోని… కడప జిల్లాలోనూ ఈ యూరేనియం సమస్య ఉంది. నిజానికి నల్లమలలో ఇంకా తవ్వకాలు ప్రారంభం కాలేదు. కానీ కడప జిల్లాలోల మాత్రం… యూరేనియం ఇప్పటికే కుంపటిలా మారింది. పులివెందుల ప్రజల జీవితాలను కాలుష్య కాసారం చేస్తోంది. దానిపై ప్రజలు పోరాడుతున్నారు. వారికి అండగా నిలిచే రాజకీయ నేతలే కరవయ్యారు. ఈ క్రమంలో… పవన్ కల్యాణ్.. తన పాదయాత్రను పులివెందుల నుంచే ప్రారంభించినా ఆశ్చర్యపోనవసరం లేదు.