అల్లు అర్జున్ పై పవన్ కల్యాణ్ ఆగ్రహం అంటూ కొన్ని వెబ్ మీడియాలో మెగా కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు కుట్రపూరితంగా చాలా ప్రయత్నాలు చేశారు. అది చిట్ చాట్ కాబట్టి తాము చెప్పింది జనం నమ్మేస్తారని తమ ఎజెండా సక్సెస్ అవుతుందని అనుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ఎవరికి ఎలాంటి అజెండాలు ఉన్నాయో బయట పెట్టాలనుకున్నారు. అందుకే చిట్ చాట్ వీడియోను పూర్తిగా రిలీజ్ చేశారు
దీంతో తప్పుడు ప్రచారాలు చేసిన కొంత మంది బట్టలు ఊడిపోయాయి. వారి ఫేక్ ప్రచారాలు అందరి ముందు నిలబడ్డాయి . దీంతో మనోభావాలు దెబ్బుతీసుకున్నారు.. మేమే కాదు చాలా మంది అలాగే చేశారంటూ సమర్థించుకునేందుకు స్క్రీన్ షాట్లతో ముందుకు వచ్చారు. నేను తిన్నది గడ్డే కానీ ఎదుటి వాళ్లు కూడా తిన్నారని చెప్పినట్లుగా ఉంది. వాళ్లతో పోలిక ఎందుకు ?. వాళ్లతో పోల్చుకుని సమర్థించుకోవడం …తాము కరెక్టే చేశామన్నట్లుగా బిల్డప్ ఇవ్వడం ఎందుకు ?
అల్లు అర్జున్ విషయంలో పవన్ కల్యాణ్ స్పందన ఎలా ఉందో అలా రిపోర్టు చేయవచ్చు. కానీ ఆగ్రహం అని… అదని.. ఇదని మసాలా జోడించి ఫేక్ న్యూసులు మా స్టైల్ అన్న అభిప్రాయాన్ని కొన్ని మీడియా, వెబ్ మీడియాలు కల్పించాయి. చివరికి దిల్ రాజు మీద కూడా నిందలేశారు. ఆయన ప్రభావంతోనే మాట్లాడారని తేల్చారు. ఇలా చేసి తప్పుడు ప్రచారంతో వేరే జీవితాల్ని ప్రభావితం చేయాలనుకోవడంతోనే సమస్య వస్తోంది.
చిట్ చాట్స్ లీడర్స్ నిర్వహించినప్పుడు తమ ఇష్టం వచ్చినట్లుగా రాసేసుకుని ఆయన అన్నాడని ప్రచారం చేయడానికి కొంత మందిఏ మాత్రం సిగ్గుపడటం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్టీఆర్ ఘాట్ ను పీకేయాలని అన్నారని తప్పుడు ప్రచారం చేశారు. చివరికి ఆయన వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇలాంటి ఫేక్ వ్యవహారాలతో సాధించేదేమీ ఉండదని తెలుసుకునేసరికి చేతులు కాలిపోతాయి.