జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డిని అత్యంత వినయంగా సంబోధిస్తూ… ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల.. ఇతరులు బాధపడినట్లు తెలిసిందని… ఎవరూ జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దనేది ఆ ట్వీట్ సారాంశం. వివాదాన్ని ఇంతటితో ముగించాలని కూడా ఆయన ఆ ట్వీట్ చివరిలో ప్రార్థనాపూర్వకంగా కోరారు. పవన్ కల్యాణ్ ట్వీట్.. అటు జనసేన వర్గాల్లోనూ.. ఇటు ఇతర పార్టీల నేతల్లో రెండు రకాల అయోమయాలను సృష్టించాయి. దానికి కారణం.. చేసిన ఆ ట్వీట్‌కి విరుద్ధంగా… పవన్ వ్యవహారాలు ఉండటమే.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి… పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం కలకలం రేపింది. సహజంగా చిన్న చిన్న విషయాలకు ఆవేశపడే పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి ప్రజల్లో ఏర్పడింది. దానికి తగ్గట్లుగానే.. ఆయన భీమవరంలో.. జరిగిన కార్యకర్తల సమావేశంలో చాలా ఆవేశంగా ప్రసగించారు. గూండాలు, ఫ్యాక్షనిస్టులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. ఉప్పెనలా దాడి చేస్తామని హెచ్చరించారు. ఇలా చాలా చాలా మాట్లాడారు. అన్నీ జగన్‌కు గురి పెట్టినవే. కానీ ఎక్కడా నేరుగా.. జగన్ పేరు ప్రస్తావించలేదు. అలా అని జగన్‌ను కాకుండా.. జనరల్‌గా అన్నారని ఎవరూ అనుకోలేదు. కానీ ఉదయమే ఆయన దానికి విరుద్ధంగా ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని అత్యంత వినయంగా సంబోధిస్తూ… ఉన్న ట్వీట్ జనసేన వర్గాలను కూడా విస్మయ పరిచింది. జగన్‌ను కనీసం క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేయకుండా.. తనే విమర్శలు చేసినట్లు… దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ట్వీట్ చేసి.. వివాదాన్ని ముగించాలని కోరడం… వారిని తికమకకు గురి చేసింది.
ఇతర పార్టీల నేతల్లోనూ పవన్ ట్వీట్ పై ఇదే తరహా అభిప్రాయం వ్యక్తమయింది. పవన్ కల్యాణ్ మరీ ఓవర్ స్మార్ట్ గా వ్యవహరిస్తున్నారని… అంటున్నారు. వ్యక్తిగతంగా తాన ఎవర్నీ ఏమీ అననని.. ట్వీట్లో కాన్ఫిడెంట్‌గా చెప్పారు పవన్. నిజానికి… ఇలాంటి విషయాల్లో పవన్ కల్యాణ్ కేసులు కూడా ఎదుర్కొంటున్న విషయాన్ని ఇతర పార్టీల నేతలు గుర్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం టాలీవుడ్లో శ్రీరెడ్డి అనే నటీమణి విషయంలో ఏర్పడిన వివాదంలో.. ఆయన మీడియాదే తప్పు అని తేల్చారు. అప్పుడే.. టీవీ నైన్ సీఈవో రవిప్రకాష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎంపీ వేమూరి రాధాకృష్ణ కుటుంబసభ్యుల ఫోటోలను ట్విట్టర్లోపోస్ట్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పుడే పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ మీడియా సంస్థల యజమానులు పరువు నష్టం కేసులుకూడా వేశారు. కానీ పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు దానికి విరుద్ధంగా… ట్వీట్ చేయడంతో చెప్పేటందుకే నీతులున్నాయని పవన్ రుజువు చేస్తున్నారంటున్నారు.
నిజానికి పవన్ కల్యామ్పై వ్యక్తిగత విమర్శలు చేసిన జగన్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ ఎవరూ..పవన్ కల్యాణ్‌పై సానుభూతి మాత్రం చూపించలేదు. కారణం… పవన్ కల్యాణ్ కూడా.. గతంలో వ్యక్తిగతంగా కొంత మందిని టార్గెట్ చేయడమేనన్న అంచనాలున్నాయి.
My appeal to all: pic.twitter.com/wxslQvF0Lx
— Pawan Kalyan (@PawanKalyan) July 26, 2018