జనసేన అధినేతకు ఆలోచన, కార్యాచరణ ఉన్నాయో లేవో కానీ.. ఆవేశం మాత్రం చాలా ఎక్కువ. ఊపిరి బిగబట్టి .. కన్నెర్ర చేసి… పిడికిలి బిగ్గింది…గాల్లోకి పిడిగుద్దులు గుద్దుతూ… చాలెంజ్‌లు చేసేస్తారు. అలా చేసిన ఓ చాలెంజ్.. “మీరు అవిశ్వాసం పెట్టండి.. నేను దేశం మొత్తం తిరిగి మద్దతు సంపాదిస్తాననే”ది. గత పార్లమెంట్ సమావేశాలకు ముందు వైసీపీ అధినేత జగన్‌తో వచ్చిన సంవాదం మేరకు ఆయన ఈ ప్రకటన చేశారు. అన్నట్లుగానే.. ఆ సమావేశాల్లో అవిశ్వాస తీర్మాన నోటీసులు చాలా పార్టీలు ఇచ్చాయి. కానీ సభ ఆర్డర్లో లేని కారణంగా… తిరస్కరణకు గురయ్యాయి. అప్పుడు మద్దతు సమీకరిస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్ సైలెంట్‌గా ఉండిపోయారు.
ఇప్పుడు… అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తోంది. అందరూ పవన్ కల్యాణ్ వైపు చూస్తున్నారు. ఢిల్లీలో మూడు రోజుల నుంచి… రాజకీయ హైడ్రామా నడుస్తున్నా.. పవన్ కల్యాణ్ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. గోదావరి జిల్లాల్లో చేపట్టాల్సిన పోరాటయాత్రను కూడా.. కారణం లేకుండా వాయిదా వేసుకున్నారు. అసలు స్పందించకపోతే… ఎవరైనా ఏమనుకుంటారోనని.. మొహమాటంగా ఈ రోజు మాత్రం ఓ ట్వీట్ చేశారు. ప్రత్యేకహోదా కోసం పోరాడటానికి పార్లమెంట్‌కు మించిన వేదిక ఉండదన్నారు. అలా అనే కదా.. తెలుగుదశం పార్టీ .. దేశంలోని ఇతర రాజకీయ పార్టీల కాళ్లా..వేళ్లా పడి అయినా.. అవిశ్వాసానికి మద్దతుగా నిలబడేలా చేసింది. మరి పవన్ కల్యాణ్ గతంలో తను చేసిన ప్రకటనకు … న్యాయం చేసేలా.. కనీసం ఒకటి రెండు పార్టీలనైనా అవిశ్వాసానికి మద్దతుగా ఒప్పించడానికి ప్రయత్నాలు చేశారా..?
అవిశ్వాసం చర్చకు రావడం ఆలస్యం.. ఇతర రాష్ట్రాల్లో తనకు ఎందరో మిత్రులున్నారని..అందర్నీ కలుస్తానన్నారు. అంతెందుకు.. తాను నివాసం ఉంటున్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ను అవిశ్వాసానికి మద్దతిచ్చేలా ఒప్పిస్తానన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ తాము మద్దతివ్వబోమంటోంది. కనీసం టీఆర్ఎస్ అధినేతతో అయినా.. మాట్లాడే ప్రయత్నం చేశారా..అంటే అదీ లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో డైలుగులు చెప్పడం చాలా ఈజీ అనుకుంటారు. కానీ వాటిని ఆషామాషీగా తీసుకుంటే.. ప్రజలు కూడా.. పవన్ రాజకీయ జీవితంలో ఓ సీన్ అనుకుని మర్చిపోతారు..కానీ సీరియస్‌గా తీసుకోరు. ఇప్పుడు అదే జరుగుతోంది.
I join the people of Andhra Pradesh in urging the BJP led Govt.of India to respond positively for the SCS. No greater Platform than Parliament to understand and empathise with this Right of ours. Please deliver Justice
— Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018
BJP’s anger on TDP leadership shouldn’t be the reason to deny SCS to the people of AP.
— Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018
BJP & TDP had wasted a great opportunity given to them by people of AP. They could have truly stood by people instead of this political theatrics,which is causing great deal of public’s valuable time ,money & agony.
— Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018