నిన్న జరిగిన కార్యకర్తల భేటీ లో కత్తి మహేష్ వివాదాన్ని, దానికి ఛానెళ్ళు ఇచ్చిన విపరీతమైన కవరేజ్ ని, తద్వారా తనపై జరిగిన దాడి ని పరోక్షంగా ప్రస్తావించాడు పవన్ కళ్యాణ్. అయితే ఇలాంటి కుట్రలు తననేమీ చేయలేవని తాను వీటికి భయపడనని చెప్పుకొచ్చాడు. ఇంతకీ పవన్ ఏమన్నాడంటే-
“దేశంలో చాలా సమస్యలున్నాయి. కానీ అవన్నీ వదిలేసి కొందరు నన్ను టార్గెట్ చేశారు. ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్దపడే వచ్చాను. నాకు కూడా చాలా మొండితనం ఉంది. నేను బలవంతుడిని. ఇలాంటివన్నీ చూసి పారిపోయే వ్యక్తిని కాను. బలవంతుడు మాత్రమే భరించగలడు. ఎవరెన్ని మాటలన్నా భరించే శక్తి నాకుంది. అయితే కార్యకర్తలు గా మీరు ఎక్కువగా రియాక్ట్ అవకండి. నాకన్నీ తెలుసు.”
అయితే ఈ వ్యాఖ్యలు పబ్లిక్ మీటింగ్ లోనో, జర్నలిస్టులు, ఛానెళ్ళ సమక్షం లోనో చేయకుండా, కాస్త ప్రైవేటుగా జరిగిన కార్యకర్తల సమన్వయ భేటీ లో ఈ వ్యాఖ్యలు చేసాడు పవన్ కళ్యాణ్. అక్కడ కత్తి మహేష్ గానీ, మరెవరి పేరుగానీ, అలాగే ఛానెళ్ళ పేర్లు గానీ ప్రస్తావించకుండా పరోక్షంగా మాట్లాడాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎవరి గురించో మాట్లాడుతున్నాడో, అక్కడున్న కార్యకర్తలకి క్లియర్ గా అర్థమైంది.