ఇండియాలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటికీ కూడా విధానాల విషయంలో, ఆలోచనల విషయంలో, ప్రచార, పాలనా తీరుతెన్నుల విషయంలో తేడాలు ఏంటి అంటే ఎవ్వరూ చెప్పలేరు….అంతా ఆ తానులో ముక్కలే అని అనిపిస్తూ ఉంటారు. కానీ పార్టీ గుర్తు, పార్టీ జెండా, పార్టీ యూనిఫాం విషయంలో మాత్రం అందరూ కూడా చాలా నిక్కచ్చిగా ఉంటారు. బోలెడంత ప్రత్యేకత చూపిస్తూ ఉంటారు. ఓటర్లు కూడా విధానాల ఆధారంగా ఏ పార్టీది ఏ విధానమో చెప్పమంటే కన్ఫ్యూజ్ అవుతారేమో కానీ పార్టీ గుర్తు, పార్టీ డ్రెస్, పార్టీ కండువాల ఆధారంగా పార్టీ పేర్లు చెప్పమంటే చాలా మంది కరెక్ట్ ఆన్సర్లే చెప్పగలరు. పార్టీ కండువాలకు ఉన్న ప్రాముఖ్యత కూడా అంతా ఇంతా కాదు. జంపింగ్ జపాంగ్ నాయకుల విషయంలో కూడా ‘కండువా మార్చేశాడ్రా…’ అని మాట్లాడుకోవడం మనవాళ్ళకు అలవాటే. కండువాలకు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ కూడా ఆయన పార్టీ కోసం ఓ కండువాను ఫైనల్ చేశాడు. కానీ ఆయన పార్టీలాగే, ఆయన పార్టీ కండువా కూడా ఎవరికీ పట్టకుండా పోయింది.
2014లో ఓపెనింగ్ జరుపుకున్న జనసేన పార్టీకి మాత్రం యూత్‌లో మంచి క్రేజే ఉంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా ఫ్యాన్స్ అయితే ఆంధ్రప్రదేశ్‌ని….ఆ మాటకొస్తే భారతదేశాన్ని కూడా పూర్తిగా మార్చేసే సత్తా జనసేన పార్టీకి, ఆ పార్టీ అధినేత పవన్‌కి ఉందని నమ్ముతున్నారు. పవన్ కూడా కాస్త లేట్‌గానే అయినా పార్టీకి సంబంధించిన ఒక్కో విషయాన్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నాడు. తాజాగా జనసేన పార్టీ కోసం ఓ కండువాను ఫైనల్ చేశాడన్న వార్తలు వస్తున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ పాపులర్ అయిన ఎర్ర తువ్వాలునే తన పార్టీ కండువాగా పవన్ ఫైనల్ చేశాడని చెప్తున్నారు. పవన్ కూడా ఆ ఎర్ర తువ్వాలు గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. ఆయన మాటల్లో వాస్తవం కూడా ఉంది. అమెరికాలో కూడా ఆ ఎర్రతువ్వాలుతో దర్శనమిచ్చాడు పవన్. కష్టానికి గుర్తు, శ్రామికుల వస్త్రం అంటూ ఆ ఎర్ర తువ్వాలు గురించి చాలా గొప్పగా ఉన్నాడు పవన్. అలాగే ఆ ఎర్ర టవల్ మన జీవనవిధానంలో భాగమన్న విషయాన్ని కూడా చెప్పాడు పవన్. పవన్ మాటలను పరిశీలిస్తుంటే మాత్రం జనసేన పార్టీ కండువాగా ఆ ఎర్రతువ్వాలునే పవన్ ఫైనల్ చేస్తాడన్న మాటలు నిజమే అనిపిస్తున్నాయి. ఈ కండువా సెలక్షన్ విషయంలో పవన్ నిర్ణయానికి ఫుల్ పాజిటివ్ మార్కులు పడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎక్కువ శాతం జనాభాకు రీచ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. పవన్ పార్టీ కండువాగా ఎర్ర తువ్వాలు దర్శనమిచ్చిందంటే మాత్రం స్టైల్ ఐకాన్‌గా కూడా ఆ టవల్ మారిపోతుందనడంలో సందేహం లేదు. ఆల్రెడీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఎఫెక్ట్‌తోనే ఆ టవల్ని భుజాన వేసుకోవడాన్ని చాలా ప్రెస్టీజియస్ విషయంగా తీసుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్.