పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్‌లు కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన వినోదాయ సీతమ్‌కి ఇది రీమేక్. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ప్రకటించలేదు. దేవుడే దిగి వచ్చినా, దేవర… అనే టైటిళ్లు బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి ‘బ్రో’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఈ వారంలోనే ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని, దాంతో పాటు టైటిల్ ని కూడా ప్రకటించాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కాలానికి ప్రతినిధిగా కనిపించనున్నాడు. పవన్ – సాయిధరమ్ తేజ్ ఇద్దరూ.. ఈ సినిమాలో ‘బ్రో.. బ్రో..’ అంటూ సంబోధించుకొంటారని, అందుకే అదే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. పవన్ ఈ చిత్రానికి 24 రోజుల కాల్షీట్లు కేటాయించాడు. అందుకుగానూ… రూ.45 కోట్ల పారితోషికం దక్కినట్టు సమాచారం.