డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తను హోంంమంత్రిని అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. పిఠాపురం పర్యటనలో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా అత్యాచారం నిందితుల్ని అరెస్టు చేయడానికి కులం అడ్డొస్తోందా అని పోలీసులపై మండిపడ్డారు. పోలీసు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అన ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలకు హోంమంత్రి కూడా బాధ్యత వహించాలన్నారు. హోంమంత్రిగా అనిత సరిగ్గా బాధ్యత వహించాలి. నేను ఆ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయన్నారు. పవన్ మాటలు వైరల్ గా మారాయి.
మీకు ఎన్ని సార్లు చెప్పాలని అధికారులపై పవన్ మండిపడ్డారు. తాము ఎవరినీ వెనకేసుకు రావడం లేదని మీరు కూడా వెనుకేసుకురావొద్దని స్పష్టం చేశారు. మాది ప్రతీకార ప్రభుత్వం కాదని .. అలాగని చేతకాని ప్రభుత్వం కాదన్నారు. శాంతిభద్రతలు చాలా కీలకమైనవని సమాజంలో చిచ్చు పెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భావ ప్రకటనా స్వేచ్చ అంటున్నారని విమర్శించారు. పదే పదే మాతో చెప్పించుకోవద్దని పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు జరుగుతున్న తప్పిదాలన్ని గత ప్రభుత్వ వాసరత్వాలేనని తేల్చారు.
పవన్ కల్యాణ్ ఇదే సమావేశంలో ఇసుకతో పాటు ఇతర విషయాల్లో జరుగుతున్న అంశాలు, వస్తున్న ఆరోపణలపైనా స్పందించారు. గత ప్రభుత్వంలో జరిగినట్లుగా ఇప్పుడు జరిగితే సహించే ప్రశ్నే లేదని అవసరమైతే అధికారుల్ని సస్పెండ్ చేయాలన్నారు. పవన్ కల్యాణ్ నోట హోంమంత్రి ప్రస్తావన రావడంతో వ్యూహాత్మకమా లేకపోతే ఫ్లోలో అన్నారా అన్న చర్చ జరుగుతోంది.