అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డికి పవన్ కల్యాణ్ గట్టి హెచ్చరికలు పంపారు. పొత్తు ప్రకటన తర్వాత జనసేన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ రెడ్డి పదవి ఉందని నియంతలా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని.. ముఖ్య మంత్రి పదవి ఉందని ఓ ఫీలైపోవద్దని సూచించారు. జగన్ నువ్వేమైనా దిగి వచ్చావా.. నువ్వెంత.. నీ బతుకెంత.. నీ స్థాయి ఎంత అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఓట్లేసిన ప్రజలు కోపం వస్తే కొట్టి చంపేస్తారని హెచ్చరించారు.
జగన్ రెడ్డి నుంచి ఏపీ ప్రజలకు విముక్తి లభించాల్సి ఉందన్నారు. జగన్ ఓ మానసిక రోగి అని..ఆయనకు ఎయిమ్స్ నుంచి మంచి డాక్టర్ ను పంపించి చికిత్స చేయాల్సి ఉందన్నారు. ఏపీలో పరిస్థితులు అత్యంత ఘోరంగా ఉన్నాయన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రినే అరెస్ట్ చేసే పరిస్థితులు వచ్చాయన్నారు. జైలుకు వెళ్లి రాటుదేలిన వాళ్లు ఉన్నారని.. కానీ జగన్ జైలుకు వెళ్లి ప్రజలను పీడించుకుంటున్నారన్నారు. ఓ పిచ్చి వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని.. జగన్ ను తన్ని తరిమేయడానికి ఇదే మంచి సమయం అన్నారు. వరంగల్‌లో జగన్ రాళ్లేసి కొట్టి పంపించేశారని పవన్ గుర్తు చేశారు.
పొత్తును స్వాగతించినందుకు క్యాడర్‌కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నేతల్ని కించ పర్చవద్దని స్పష్టం చేశారు. జైలులో ఉన్నారనితక్కువ చేసి మాట్లాడవద్దన్నారు. పొత్తులో ఉన్న వారిని గౌరవించాలని సూచించారు. కష్టకాలంలో ఉన్న వాళ్లకి అండగా ఉండాల్సిందేనన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి రాష్ట్ర పరిస్థితులను అమిత్ షా , నడ్డాకు వివరిస్తానన్నారు. అక్రమ అరెస్టులను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నాంకాబట్టి.. పొత్తు అంశాన్ని వాళ్లకు వివరిస్తామని.. రాష్ట్ర పరిస్థితులను కూడా వివరిస్తామన్నారు.
పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ పార్టీ క్యాడర్ లో జోష్ నింపింది. ఈనెల 21వ తేదీన కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లాలో అన్ని కీలక నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగే అవకాశం ఉంది.