ప్రస్తుతం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన చిరునామా మారబోతోందా?? ఆయన ఏలూరు ఫిష్ట్ అవుతున్నాడా? జనసేన వర్గాలు అవుననే అంటున్నాయి. సోమవారం ఏలూరు నుంచి వచ్చిన అభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్‌ని కలుసుకొన్నారు. ఈసారి ఏలూరులో ఓటు హక్కుని నమోదు చేయించుకోవాల్సిందిగా పవన్ కల్యాణ్‌ని కోరారు. దానిపై పవన్ సానుకూలంగా స్పందించాడు. ఏలూరులో ఓటు నమోదు చేయించుకోవడానికి సముఖత చూపించాడు. అంతేకాదు.. ఏలూరులో తనకు అనువైన నివాస భవనాన్ని చూడాలని అక్కడి అనుచరుల్ని కోరాడు. ఇప్పటి వరకూ పవన్‌కి హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉంది. ఇప్పుడు ఏలూరుకి షిఫ్ట్ చేస్తున్నాడన్నమాట.
పవన్ ఓటు హక్కు హైదరాబాద్ నుంచి ఏలూరుకి మారడానికి రాజకీయపరమైన కారణాలూ దోహదం చేస్తున్నాయంటున్నాయి కొన్ని వర్గాలు. పవన్ సమైఖ్య రాష్ట్రం కోసం గళమెత్తిన రాజకీయ నేత. రాష్ట్రం విడిపోయిన తరవాత ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నాయకుడు. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా. అలాంటప్పుడు పవన్ ఓటు హక్కు ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఉండడం సరైనదని పవన్ సన్నిహితులు పలుమార్లు పవన్ కి సూచించారు. ఇప్పుడు ఫ్యాన్స్ అడిగారన్న నెపంతో.. పవన్ తన ఓటు హక్కుని అక్కడికి మార్చి ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పవన్ ఇప్పుడు ఏలూరు షిఫ్ట్ అవ్వబోతున్నాడన్నమాట