పవన్ కల్యాణ్ చేతిలో ఉన్న సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీష్ శంకర్ దీనికి దర్శఖుడు. ‘హరి హర వీరమల్లు’,’ఓజీ..’ ఇవన్నీ పూర్తయ్యాకే ఈ సినిమాపై ఫోకస్ పెట్టాలనుకొన్నాడు పవన్. అందుకే హరీష్ ఇంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. మధ్యలో ఓ ఐదారు రోజులు కాల్షీట్లు ఇస్తే.. చక చక కొంత టాకీ పార్ట్ పూర్తి చేయడమే కాకుండా.. ఫస్ట్ గ్లిమ్స్ పేరుతో చిన్న టీజర్ వదిలాడు హరీష్. ఈ గ్లిమ్స్తో.. ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. పవన్ చేస్తున్న మిగిలిన సినిమాలతో పోలిస్తే.. కాస్త క్రేజ్ ఎక్కువ ఉన్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. అంతేకాదు.. బిజినెస్ పరంగానూ ఈ సినిమా స్పీడుగా ఉంది. పవన్ – హరీశ్ కాంబినేషన్లో రూపొందిన ‘గబ్బర్ సింగ్’ సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ తరవాత వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న సినిమా ఇదే. పైగా పవన్ పోలీస్ డ్రస్ వేసిన ప్రతీసారీ.. మినిమం గ్యారెంటీ సినిమా ఇచ్చాడు. అందుకే.. ఉస్తాద్ పై ఇన్ని అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కూడా… ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడట. వీలైతే ఓజీని పక్కన పెట్టి.. ఉస్తాద్ ని ఫినిష్ చేయాలనుకొంటున్నాడు. పవన్ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. దానికి తగ్గట్టుగా దర్శక నిర్మాతలు ప్రిపేర్ అయిపోవాల్సిందే. హరీష్ కూడా బౌండెడ్ స్క్రిప్టుతో రెడీగా ఉన్నాడట. పవన్ ఎప్పుడు పిలిచినా – షూటింగ్ చేసుకోవడానికి అనువుగా… స్క్రిప్టు రెడీ చేసుకొన్నాడు. ఇప్పటికైతే.. ఓజీ కంటే ఉస్తాద్ ని ముందుగా పూర్తి చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్టు టాక్. అదే జరిగితే.. వీరమల్లు ఇంకాస్త వెనక్కి వెళ్తుంది.