వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదికగా ప్రకటించారు. ఈ విషయంలో బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామందని.. దాని కోసం ఎదురుచూస్తున్నామని ప్రకటించారు. రాజకీయ ప్రయోజనాలు వదిలి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చే వారితో పొత్తుల గురించి ఆలోచిస్తామని ప్రకటించారు. వైసీపీ కొమ్ములు విరుస్తామని.. పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మీరు కూల్చేవారు..మేము కట్టే వారమని వైసీపీకి సందేశం పంపారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే జనసేన టార్గెట్ అనిపవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 2024లో ప్రజా ప్రభుత్వం స్థాపిస్తామన్నారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ సందర్భంగా పవన్ కల్యాణ్ మినీ మేనిఫెస్టోను ప్రకటించారు. జనసేన సౌభాగ్య పథం అబివృద్ధి పథం పేరుతో పథకాలు ప్రకటించారు. యువతకు వ్యాపారాభివృద్ధికి రూ.పది లక్షలు , సీపీఎస్ రద్దు చేస్తాం..పాత పెన్షన్ విధానం తీసుకు రావడం, అధికారంలోకిరా కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు, తెల్ల రేషన్ కార్డు దారులకు ఉచిత ఇసుక, విశ్వనగరంగా విశాఖను తీర్చిదిద్దుతాం, ప్రతీ ఏటా ఐదు లక్షల ఉద్యోగాలు, బలమైన నూతన పారిశ్రామిక విధానం, అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యం అని… వచ్చే ఎన్నికల్లో షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తామని ప్రకటించారు.
ఆవిర్భావ సభలో పవన్ ఉత్సాహంగా మాట్లాడారు. ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు సాధించామని …1209 మంది సర్పంచ్‌లు గెలిచారు, 46 లక్షల సభ్యత్వం ఉందని.. త్వరలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఏ ప్రభుత్వం వచ్చినా శంకుస్థాపనలతో మొదలు పెడుతుంది
వైసీపీ ప్రభుత్వం కూల్చివేతలతో ప్రారంభించింది..భవన నిర్మాణ కార్మికల జీవితాలు రోడ్లపై పడేశారని మండిపడ్డారు. ఏపీ నా మాతృభూమి – ఏపీ ప్రజలు నా బానిసలు అనేది వైసీపీ నేతల ఆలోచనతో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరి ఆర్థిక మూలాలను దెబ్బకొడుతున్నారని మండిపడ్డారు.
రాజధాని అమరావతేనని.. పవన్ బలంగా తేల్చి చెప్పారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదన.. అమరావతి కి అంగీకరించినప్పుడు మూడు రాజధానుల గురించి అప్పట్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశఅనించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనన్నారు. ముందుగా ప్రసంగించిన నాగబాబు కూడా ప్రభుత్వంపై విరుచుకుపడారు. జగన్ మళ్లీ సీఎం అయితే ఆంధ్రులు కాందిశీకుల్లా పక్కరాష్ట్రాలకు వలస పోవాలన్నారు. ఏపీ రోడ్లపై వెళ్తూంటే పాడెపై వెళ్తున్నట్లేనని మంచి సీఎంను చూశా.. చెడ్డ సీఎంను చూశా…కానీ దుర్మార్గ సీఎం జగనేన్నారు.