ఆత్మవిశ్వాసం ఆకాశానికి చేరిన నేత ఎలా మాట్లాడతారో పవన్ కల్యాణ్ జయకేతనం సభలో అలాగే మాట్లాడారు. 2104లో ఒక్కడ్నై కదిలి పార్టీ పెట్టి.. ఓటమికి భయపడకుండా…పోరాటం చేసి 2024జనసేనతో పాటు నలభై ఏళ్లు టీడీపీని అలాగే.. రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏను నిలబెట్టామని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ జనసేనకు జన్మస్థలమని.. ఏపీ కర్మస్థలమన్నారు. జనసేన పార్టీకి తమిళనాడులోనూ ఆదరణ ఉందన్నారు. తన తెలుగు స్పీచ్‌లు తమిళులు చూస్తున్నారని తెలిసిందన్నారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ జనసేనకు అభిమానులు ఉన్నారని పవన్ చెప్పారు.
2019లో ఓడిపోయినప్పుడు అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వబోమని తొడలు కొట్టారన్నారు. ఇప్పుడా తొడలను బద్దలు కొట్టామన్నారు. వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి దేశం అంతా మన వైపు తిరిగి చూసేలా చేశామన్నారు. కరెంటు షాక్ తగిలి చనిపోబోయిన తనకు కొండగట్టు ఆంజనేయ దీవెన, ప్రజల దీవెనతో తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందన్నారు. మహారాష్ట్రలో రాజకీయ అభిమానులు ఉంటారని వెళ్లేంత వరకు తెలియదన్నారు మనం ప్రచారం చేసిన ఒక్కసీటు తప్ప అన్ని ప్రాంతాల్లో గెలిచింది ఎన్డీఏ అని గుర్తు చేసుకున్నారు. భగవంతుడు రాసిన రాత వల్లే రాజకీయాలు చేస్తున్నానని ఇదంతా భగవంతుడు మాయ తప్ప నాది కాదని తెలుసన్నారు. నాలోని భావతీవ్రత పార్టీ పెట్టేలా చేసిందిన్నారు.
భారతదేశానికి బహుభాషా విధానం మంచిదన్నారు. తమిళనాడు సహా అందిరకీ ఒకే విధానం ఉండాలన్నారు. సగటు మధ్యతరగతి మనిషిగా బతకడమే తన కోరిక అని ఫలితం ఆశించకుండా పదకొండేళ్లుగా పార్టీని నడుపుతున్నానన్నారు. ఆ కష్టాలన్నింటికీ జయకేతనం సంతృప్తినిచ్చిందన్నారు. కొందరు అభిమానులు ఓజీ ఓజీ అని నినాదాలు చేశారు. దీంతో పవన్ కల్యాన్ వారిని వారించే ప్రయత్నం చేశారు. ఈ సభలో సినిమా గురించి మాట్లాడం సరికాదని హితవు చెప్పారు. ఇక్కడ జనసైనికులు ప్రాణలు తెగించి పోరాటం చేసినవాళ్లు. 450 మంది పైగా జనసైనికులు సిద్దాంతాలు నమ్మి చనిపోయారు. వారి గౌరవం కోసం.. మనం సినిమాలు ఇక్కడ మాట్లాడవద్దన్నారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించారు.పెద్దఎత్తున అభిమానులు హాజరయ్యారు.