అసెంబ్లీ వేదికగా పవన్ కల్యాణ్ మరోసారి ప్రజలకు స్పష్టత ఇచ్చారు. ఏపీలో ఎన్డీఏ కూటమి పాలన మరో పదిహేనేళ్ల పాటు ఉంటుందని స్పష్టం చేశారు. కూటమిలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుకుపోతామని .. స్పష్టం చేశారు.అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఏపీ ప్రజలకు తాను మాట ఇస్తున్నానని కనీసం పదిహేనేళ్ల పాటు ఎన్డీఏ పాలన ఉంటుందన్నారు. మాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ఉంటామన్నారు.
ప్రతిపక్షం అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్న తరుణంలో అసెంబ్లీలో అధికార,ప్రతిపక్షం బాధ్యతలను తామే నిర్వహిస్తామన్నారు. వైసీపీ పాలనలో ఏపీ సంక్షోభంలో కూరుకుపోయింది. గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయి. కూటమి ప్రభుత్వం సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వైసీపీ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. అసెంబ్లీలో ఉన్న కొద్ది సేపటిలోనే వారు వ్యవహరించిన విధానం..వివేకా హత్య దగ్గర నుంచి అనేక అరాచకాలను గుర్తు చేశాయన్నారు.
కూటమిని విడదీయడానికి వైసీపీ అధినేత జగన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారని జగుగుతున్న ప్రచారంతో పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన క్లారిటీ ఇచ్చినట్లయింది. కలసి ఉంటే కలదు సుఖమని.. కూటమిగా ఉంటే వైసీపీకి మరో చాన్స్ రాదన్న అభిప్రాయం బలంగా ఉండటంోత.. జగన్ తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. జనసేనానికి మాత్రం పూర్తి స్పష్టత ఉంది.