పదిహేడేళ్ల బాలుడ్ని ఫ్రాన్స్ లో పోలీలులు కాల్చి చంపితే ఆ దేశం అట్టుడికిపోయింది. అదే పదిహేడేళ్ల పిల్లవాడిని కులోన్మాదంతో ఓ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తి పెట్రోల్ పోసి కాల్చి చంపితే మన దగ్గర కదలిక రాలేదు. స్వయంగా చనిపోయే ముందు వాంగ్మూలం ఇచ్చినా.. ఆ బీసీ బిడ్డ అక్కపైనా.. కుటుంబంపైనా నిందలు వేసి వికటాట్టహాసాలు చేశారు. నిందితులు కొద్ది రోజుల్లోనే బెయిల్ వచ్చి ఆ కుటుంబాన్ని బెదిరిస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి కొద్దిగా గీసుకుపోతే.. ఏపీ ప్రజలకు జరిగిన గాయం ఆంటూ వైసీపీనేతలు ప్రచారం చేస్తున్నారు. వీటన్నింటిపై ప్రశ్నిస్తూ పవన్ తెనాలిలో ఇచ్చిన స్పీచ్ ప్రతి ఒక్కరి మనసును తాకుతోంది.
మరి బీసీ బిడ్డను కాల్చి చంపినప్పుడు గాయం కాలేదా ?
అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా?
రేపల్లె రైల్వే స్టేషన్లో భర్త ముందే మహిళపై మానభంగం చేస్తే దొంగతనం కోసం వచ్చి పొరపాటున చేశారని ఓ మంత్రే గాయం కాలేదా ?
అంటూ పవన్ సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరు చెల్లెళ్లు బాబాయిని చంపేశారని గొంతు చించుకుంటుంటే ఒక్క పోలీస్ అఽధికారి మాట్లాడడు. సీబీఐ వస్తే కడప కోటలోకి వెళ్లనివ్వరు. ఇంత దారుణాలు జరుగుతుంటే మనకిపట్టదు. ఒక వ్యక్తిని గొడ్డలితో నరికి చంపితే గుండెపోటంటారు. మనం మాత్రం చేతులు ముడుచుకు కూర్చుంటామని ఆవేశంగా ప్రశ్నించారు. పవన్ ఆవేశంలో ఉన్న నిజాయితీ అందర్నీ కదిలిస్తోంది. ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎన్ని అరాచకాలకు జగన్ ఒక్కడే కారణం. నేరస్తుల్ని నెత్తిన పెట్టుకుని చేస్తున్న రాజకీయాల వల్ల శవాలు డోర్ డెలివరీ అవుతున్నాయి. ఆడవాళ్ల మాన ప్రాణాలకు గ్యారంటీ లేకుండాపోయింది.
గంజాయి కేంద్రంగా రాష్ట్రం మారిపోయింది. పోలీసు స్టేషన్లు రౌడీలకు అడ్డాగా మారిపోయాయి. ఎన్ని ఘోరమైన ఘటనలు జరిగినా ఒక్కరికీ గాయం కాలేదు. తప్పు జగన్‌ది కాదు. మనదే. ఆయన ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇసుక మొత్తం దోచేశారు. ఎందరో బీసీలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉపాధి ఉండేది. వారి పొట్టలు కొట్టి ఒక్కరికే దోచిపెట్టారు. మద్య నిషేధం అని చెప్పిన జగన్‌రెడ్డి సారా వ్యాపారిగా మారిపోయాడు అయినా మనం ప్రశ్నించలేకపోతున్నామని ధర్మావేశంతో వ్యక్తం చేసిన ఆవేదన.. అందర్నీ ఆలోచింప చేస్తోంది.
పవన్ ప్రసంగాన్ని విన్న ఎవరికైనా.. మనం ఏం కోల్పోయామో… రాజకీయాల మత్తులో.. కులం మత్తులో .. ఎంత బానిసలుగా మారామో.. అర్థమవుతుంది. మామూలుగా రాజకీయసభలో ప్రసంగం అనుకుని చాలా మందిలైట్ తీసుకున్నారు కానీ.. ఇప్పుడీ స్పీచ్ పవన్ పొలిటికల్ స్పీచ్‌లలో ది బెస్ట్ అన్నట్లగా మారింది.