ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ ఫైల్స్ పై ఆయన సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ఎమ్మెల్యేలు, నాయకులు పవన్‌కు అభినందనలు తెలిపారు.
దాదాపు 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ కి ఇది అరుదైన ఘట్టం. కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ స్థాపించినప్పటి నుంచి ప్రజలతో మమేకమై వున్నారు పవన్. జనసేన ప్రస్తానం అందరికీ తెలిసిందే. ఈ పదేళ్ళలో ఎన్నో అటుపోట్లు చూశారు. 2019 ఎన్నికలు పవన్ కు చేదు అనుభవాన్ని ఇచ్చాయి. అయితే అపజయానికి కుంగిపోకుండా మరింత బలం తెచ్చుకొని జనాల్లోకి వెళ్లారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు జనసేనకు వందశాతం విజయం ఇవ్వడం ఓ కొత్త చరిత్ర. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు. ఇది జనసేన ప్రస్థానంలో ఓ గొప్ప సందర్భం. ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్ మొదలైయింది. సినిమాల్లో అగ్ర శిఖరాలు సాధించిన పవన్.. పాలనలో కూడా మేటిగా నిలవాలని కోరుకుంటూ.. జనసేనానికి ఆల్ ది బెస్ట్.