కాపుల్లో ఐక్యత లేకపోవడం వల్లే రాజకీయ సాధికారత సాధించలకేపోతున్నారని పవన్ కల్యాణ్ కకీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సేనకు చెందిన ప్రతినిధులతో పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాపుల ఆత్మగౌరవాన్ని తగ్గించబోమని… జనసేనను నమ్మిన వారి ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తగ్గించబోమన్నారు. కాపులంతా ఐక్యంగా ఉండాలని కట్టుబాటు చేసుకోవాలన్నారు. అధికారంలో ఉన్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు గౌరవం ఇచ్చితీరాలి. గొడవ పెట్టుకుంటే ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెడతారనే భయం ఉంటుందిన్నారు. ఇటీవల జరుగుతున్న ప్రచారం కారణంగా తాను లోపాయికారి ఒప్పందాలకు లొంగిపోనని ప్రకటించారు.
కుళ్లు, కుతంత్రాలు, కుట్రలు లేకుండా రాజకీయం లేదన్నారు. వెయ్యి కోట్లు ఉన్నా రాజకీయాలు చేయలేమని .. పార్టీని నడపలేమని.. భావజాలం ఉంటనే పార్టీని నడపగలమన్నారు. రాయలసీమలో మైన్స్ మొత్తం సీఎం కుటుంబం చేతుల్లో ఉందని.. బలిజలు నోరు ఎత్తలేరన్నారు. ఆ మైన్స్ అన్నీ ఒకప్పుడు బలిజలేవనని గుర్తు చేశారు. దీనికి కారణం ఐక్యత లేకపోవడంమేనన్నారు. కాపులు పార్టీ నడపలేరని ఎవరైనా అంటే.. చెప్పు తెగేలా సమాధానం చెప్పాలన్నారు. వీటన్నింటినీ ఎదుర్కోవడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. తానేం మెత్తటి మనిషిని కాదన్నారు.
సంఖ్యాబలం ఉన్నా రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరడంలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వతా రిజర్వేషన్ల గురించి మాట్లాడటం లేదని… మండిపడ్డారు. కాపులవైపు నిలబడబోమని చెప్పినా ఓటేసినా గెలిపించారని.. కుల ఆత్మగౌరవాన్ని కాదని కూడా ఎందుకు ఓటేసి గెలిపించారని ప్రశ్నించారు. ప్రస్తుతం అధికార పార్టీని ఎదిరిస్తే.. మానసికంగా శారీరకంగా హింహిస్తారన్నారు. కాపు సంఘాలన్నింటినీ ఐక్యత చేసుకుంటే దక్షిణ భారతదేశంలో కీలక పాత్ర పోషిస్తామన్నారు. కాపులకు ేదైనా మంచి జరగాలంటే అది తానే చేయగలనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
తాను ఓడిపోతే తొడకొట్టిన వాళ్లు కాపు నేతలేనని విమర్శించారు. మీరు మీరు కొట్టుకు చావండి అని వైసీపీ నేతలంటున్నారని… ఐక్యత ఉంటేనే ఏదైనా చేయగలమన్నారు. కాపుల దగ్గర ఆర్థిక బలం తక్కువన్నారు. అందుకే ఏకమవ్వాలని పవన్ పిలుపునిచ్చారు.