జనసేన పార్టీ అధినేత పర్యటన హుషారుగా సాగుతోంది. ఆద్యంతం ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఏపీ రాజధాని అమరావతి వేదికగా శుక్రవారం జనసేన 3 జిల్లాల కార్యకర్తల సమావేశంలో పవన్ పాల్గొని మాట్లాడారు. విజయవాడలో కులాల చిచ్చు రగులుతూనే ఉందని ఇది అభివృద్ధి కి ఆటంకం అన్నారు. ఈ కాలంలో కూడా ఇంకా కుల మత ప్రాంతీయ భావాలు, భేదాలు కొనసాగడం శోచనీయం మని, అలాంటి పరిస్థితులు తెలంగాణ లో లేవని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలు ప్రపంచ స్థాయి రాజధాని కి అనుకూలంగా లేవన్నారు.
విజయవాడలో రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగాను ప్రస్తావించకుండా ఉండలేం అన్నారు. ఆయన హత్యను ప్రస్తావిస్తూ నిరాయుధుడిగా ఉన్న వ్యక్తిని చంపడం దారుణం అన్నారు. ఆ హత్య తరువాత విజయవాడలో దారుణమైన విధ్వంసాలు చోటుచేసుకున్న వైనాన్ని గుర్తు చేశారు. ఇక్కడి కులపోరాటాలు ఆగకపోతే ప్రపంచ స్థాయి రాజదాని అసాధ్యం అని స్పష్టం చేశారు. ఇలాంటి అడ్డంకులు లేకపోవడంతో నే చంద్రబాబు సైబరాబాద్ నిర్మించగలిగారు అంటూ దీనికి ఆయన్ను అభినందిస్తున్నా అన్నారు