తమిళనాడులోనూ పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. దానికి ఒక్క ఇంటర్యూనే కారణం. లడ్డూ ఇష్యూ అంశం తమిళనాడులోనూ హాట్ టాపిక్ అయింది. పవన్ పోరాటంపైనా చర్చ జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని ప్రముఖ టీవీ చానల్ తంతి టీవీ ఓ సుదీర్ఘమైన ఇంటర్యూ చేసింది. తమిళనాడు సంస్కృతి నుంచి సనాతన ధర్మం వరకూ .. సినిమాలతో సహా అన్నింటిపైనా పవన్ సూటిగా చెప్పిన సమాధానాలు తమిళుల్ని ఆకట్టుకున్నాయి. ఎందుకంటే ఈ ఇంటర్యూలో పవన్ సమాధానాలు అచ్చమైన తమిళంలోనే ఇచ్చారు.
తంతి టీవీ ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాక.. గంటల్లోనే భారీ వ్యూస్ వచ్చాయి. వందల కింద కామెంట్లు వచ్చాయి. అంతా తమిళులే. పపన్ కల్యాణ్ విషయంలో తమ అభిప్రాయం మారిపోయిందని చాలా మంది చెప్పారు. తమిళ సంస్కృతిపై ఆయన అవగాహన చాలా మందిని మెప్పిచింది. అయితే తమిళనాడులో బీజేపీ తరహా హిందూత్వ రాజకీయాలను ఖండించేందుకు చాలా మంది ఉంటారు. వారు పవన్ పై విమర్శలు చేస్తున్నారు. అలా పాజిటివ్ గా.. ఇలా నెగెటివ్ గా పవన్ తమిళనాడులో ట్రెండ్ అవుతున్నారు.
పవన్ కల్యాణ్ చిన్న తనంలో ఎక్కువగా చెన్నైలోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన తమిళాన్ని నేర్చుకున్నారు. హైదరాబాద్ షిప్ట్ అియనా భాష మర్చిపోలేదు. లడ్డూ వివాదం పుణ్యమా అని పవన్ కల్యాణ్ ఇప్పుడు తమిళంలోనూ ప్రజలందరికీ చిరపరితం అయ్యారు.