డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ తనకు ఉన్న బాధ్యతల్ని వంద శాతం పర్ ఫెక్ట్ గా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన శాఖ పరిధిలో ఒకే సారి గ్రామ సభల్ని నిర్వహించి రికార్డు సృష్టించేలా చేశారు. ఇప్పుడు వన మహోత్సవానికి రెడీ అయ్యారు. ప్రజల భాగస్వమ్యంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
30వ తేదిన జరగనున్న వనమహోత్సవంలో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నరు. నగరవనాల అభివృద్ధి కోసం ప్రతిగ్రామం, పట్టణం, నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేడుకలా చేయనున్నారు. ఇప్పటికే నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాలు అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేసింది 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీల పరిధిలో నూతనంగా నగర వనాలను అభివృద్ధిచేయనున్నారు రాష్ట్రంలో పస్త్రుతం 50 నగర వనాల అభివృద్ధికి వేగంగా పనులు సాగుతున్నాయి. వీటిని వ వేగగంగా పూర్తి చేయనున్నారు.
పవన్ కల్యాణ్ తనకు కేటయించిన అటవీ , పంచాయతీరాజ్, పర్యావరణ శాఖల విషయంలో తనదైన ముద్ర వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన వేరే విషయాలపై దృష్టి పెట్టకుండా పూర్తిగా తన శాఖ పైనే దృష్టి కేంద్రీకరించారు. ఆ డిఫరెన్స్ ఆయా శాఖల పనితీరులో స్పష్టంగా కనిపిస్తోంది.