పవన్ కల్యాణ్ కెరీర్లోనే మర్చిపోలేని సినిమా… తొలి ప్రేమ. యూత్‌కి పవన్‌ని బాగా దగ్గర చేసిన సినిమా ఇది. ఓ కల్ట్ క్లాసిక్. లవ్ స్టోరీల్లో తొలి ప్రేమకు ఉన్న స్థానం వేరు. ఈ సినిమా వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా ఈనెల 30న రీ రీలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే వెండి తెరపై, డీవీడీల్లో, హోం స్క్రీన్స్ లో, టీవీల్లో ఈ సినిమాని చాలాసార్లు చూసేశారు. అయినా ఆ క్రేజ్, ఆ హీట్ ఏమాత్రం తగ్గలేదు. ఈ నెల 30న రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే… టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. సంధ్య 70 ఎం.ఎంలో ఉదయం 8 గంటల షోకి టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. దాదాపు 300 థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తుంటే.. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. పవన్ ఖుషి సినిమా రీ రిలీజ్ చేస్తే.. కనీ వినీ ఎరుగని కలక్షన్లు వచ్చాయి. ఇప్పుడు ఖుషి రికార్డుని ఈ సినిమా బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాతికేళ్ల క్రితం ఈ సినిమా కోసం పవన్‌కి ఇచ్చిన రెమ్యునరేషన్ చాలా తక్కువ. అప్పట్లో… నిర్మాత పవన్‌కి పారితోషికం ఇవ్వలేదు. నెల నెల జీతంగా కొంతమొత్తం ఇచ్చారు. సినిమా రిలీజైన రెండో రోజు పారితోషికంగా కొంత మొత్తం అప్పగిస్తే ఆ డబ్బులతో పుస్తకాలు, మొబైల్ కొనుకొన్నాడట పవన్. ఈ విషయాన్ని తొలిప్రేమ నిర్మాత స్వయంగా వెల్లడించారు