చేనేతకు సెలబ్రిటీ చేయూత లభించింది. నేతన్నలకు పవన్ కల్యాణ్ అండ దొరికింది. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా మద్దతు ఇవ్వడానికి పవర్ స్టార్ అంగీకరించారు. తెలంగాణ, ఏపీ చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులకు స్వయంగా హామీ ఇచ్చారు.
తెలంగాణ అఖిలపక్ష చేనేత ఐక్య వేదిక ప్రతినిధులు, ఏపీ కార్మిక సంఘం నాయకులు జనసేన కార్యాలయంలో పవన్ ను కలిశారు. తమ సమస్యలను విన్నవించుకున్నారు. చేనత రంగం దుస్థితిని వివరించారు. గత రెండున్నర సంవత్సరాల్లో కేవలం తెలంగానలో 45 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఈ వివరాలు విన్న పవన్ కల్యాణ్ చలించిపోయారు. చేనేతకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బ్రాండ్ అంబాసిడర్ గా చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తానని వాగ్దానం చేశారు.
ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన నిలబడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు చేనేత కార్మికులకు అండగా నిలబడనున్నారు. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు బ్రాండ్ అంబాసిడర్ గా మారి, చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిస్తే అది కచ్చితంగా నేతన్నల ఉత్పత్తుల సేల్స్ పెంచుతుందని ఆశిస్తున్నారు.