పవన్ కల్యాణ్‌కి ఖాఖీ డ్రస్సు అంతగా కలిసిరాలేదు. గుడుంబా శంకర్‌లో కాసేపు ఖాకీ బట్టలతో కనిపించాడు పవన్. మొన్నటి సర్దార్ గబ్బర్సింగ్లోనూ పోలీసే. అదీ ప్లాప్. అయితే `గబ్బర్ సింగ్` మాత్రం ఖాకీ కథలకు కొత్త కలరింగు ఇచ్చింది. పోలీస్ కథలు అనగానే… ఇప్పటికీ గబ్బర్ సింగ్‌ని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు పవన్ – హరీష్ శంకర్ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. ఇది వరకే పవన్ కోసం ఓ పవర్ఫుల్ లైన్‌ని తయారు చేసుకున్నాడు హరీష్. అయితే ఈసారీ ఇందులో పవన్ పోలీస్‌గానే కనిపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హిందీ దబాంగ్కి రీమేక్. అయితే హీరో క్యారెక్టరైజేషన్లో దబాంగ్కి మించిన మసాలా ఉంటుంది. అచ్చం అలాంటి క్యారెక్టరైజేషన్‌తోనే హరీష్ శంకర్ ఓ కథ తయారు చేశాడని, అది పవన్‌కి కూడా నచ్చిందని తెలుస్తోంది. పోలీస్ పాత్ర అనగానే గబ్బర్ సింగ్‌తో పోలికలు మొదలైపోతాయి. ఈ విషయంలోనే అటు పవన్, ఇటు హరీష్ ఆలోచనలో పడ్డారు. గబ్బర్ సింగ్‌తో పోల్చుకున్నా ఫర్వాలేదని హరీష్, పవన్‌లు భావిస్తే.. మరో పోలీస్ స్టోరీని తెరపై చూసేయొచ్చు.