సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీని పాతాళంలోకి పడేసే సలహాలు ఇచ్చినా తన విషయంలో మాత్రం ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. కడప జిల్లాలోని సీకే దిన్నె మండలంలో ఏకంగా రిజర్వ్ ఫారెస్టును కబ్జా చేశారు. ఓ గెస్ట్ హౌస్ ను నిర్మించారు. అవన్నీ తన బినామీలు.. పని వాళ్ల పేర్లపై పెట్టాడు. వాటిలో వారితోనే పనులు చేయించుకుంటున్నాడు. ఈ విషయం తాజాగా బయటపడింది. అటవీ భూమి కావడంతో అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారు.
కడప జిల్లాలో ఉన్న ఆ భూములు ఎవరి కబ్జాలో ఉన్నాయి.. అసలు అటవీ భూమిని ఎలా స్వాధీనం చేసుకున్నారు.. వన్యప్రాణులకు ఎలాంటి నష్టం జరిగింది.. వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అధికారుల నివేదిక తర్వాత ఆయన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇవి బినామీల పేర్ల మీద ఉన్నాయి కాబట్టి తమకు సంబందం లేదని సజ్జల తేల్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది తమది కాకపోయినా అవి రిజర్వు ఫారెస్టు కాదనో.. మరొకటనో వాదిస్తారు. ఎందుకంటే పదేళ్ల పాటు వ్యవస్థల్ని వారి చేతుల్లో పెట్టుకుని ప్రతి రికార్డును ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చో అలా చేశారు.
ఇప్పటికీ కడప జిల్లాలో అధికారులు సజ్జలకు వ్యతిరేకంగా నివేదిక ఇస్తారా లేదా అన్న సందేహాలు ఉన్నాయి. అయితే పవన్ కల్యాణ్ రాష్ట్ర స్థాయి అధికారులతో ప్రత్యేక నివేదికలు తెప్పించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ భూములు సజ్జల ఫ్యామిలీవే.. వారి అధీనంలో ఉన్నాయని తేలితే కేసులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.