నెల్లూరులో బారాషహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండుగ ఎంతో ప్రసిద్ధమైంది. దాదాపు ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారు. వారికి ఏ రొట్టె కావాలో అంటే పెళ్లి రొట్టె , ఉద్యోగం రొట్టె, సంతానం రొట్టె ఇలా ఆ రొట్టెలు అందుకుంటారు.
ఇవాళ జనసేనని పవన్ కళ్యాణ్ నెల్లూరు లో జరిగే రొట్టెల పండుగలో పాల్గొననున్నారు. రొట్టెల పండుగలో భాగంగా “గెలుపు రొట్టె”ను ఇవాళ పవన్ కళ్యాణ్ అందుకోనున్నారు. గెలుపు రొట్టె అందుకున్న తర్వాత జనసేన కార్యకర్తలతో నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
ఈ రొట్టెల పండుగ ఎన్నో ఏళ్లుగా నిర్వహించబడుతూ హిందూ-ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇవాల్టి రొట్టెల పండుగలో జనసేనాని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు అనడంలో సందేహం లేదు.