ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లు అర్జున్ను ఇవాళ పరామర్శించనున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ తో కలిసి ఆయన అర్జున్ నివాసానికి వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ ఇంకా సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. కుటుంబసభ్యుడు కావడంతో సోషల్ మీడియాలో స్పందించడం కన్నా నేరుగా వెళ్లి పరామర్శించడమే మంచిదని భావించినట్లుగా తెలుస్తోంది.
సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ ఆయన ఓ రోజు రాత్రి జైల్లోఉండాల్సి వచ్చింది. నాలుగువారాల మధ్యంతర బెయిల్ తర్వాత మళ్లీ బెయిల్ పొడిగింపు తెచ్చుకోవాలి లేదా నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. బన్నీ అరెస్టు వెనుక రాజకీయం ఉంటుందన్నది ప్రచారం ఎక్కువగా జరుగుతూండటంతో దాదాపుగా అన్ని పార్టీలు ఓ స్టాండ్ తీసుకున్నాయి.
కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నేతలు కూడా అరెస్టును వ్యతిరేకించారు. ఏపీలోని వైసీపీ పార్టీ ఇదే సందనుకుని అర్జున్ కు మద్దతు ప్రకటించింది.చంద్రబాబు నేరుగా అరవింద్ కు, అర్జున్ ఫోన్ చేశారు. ఈ క్రమంలో పవన్ నేరుగా పరామర్శించనున్నారు.