పవన్ కల్యాణ్‌పై ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు కాపు సామాజికవర్గానికి చురుకు పుట్టించాయి. మెతగ్గా ఉండి అలుసైపోయామని.. ప్రతి ఒక్కరూ.. అత్యంత హీనంగా మాట్లాడుతున్నారని .. తిరగబడకపోతే.. మరింత దిగజారిపోతామన్న అంచనాకు వచ్చారు. పవన్ కల్యాణ్ కూడా.. ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే.. ఆయన నేరుగా… ఢిల్లీ నుంచి కాకినాడ వస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పవన్ కల్యాణ్‌కు స్వాగతం చెప్పి.. కాకినాడలో బలప్రదర్శన చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. ఏం జరుగుతుందో.. అన్న టెన్షన్.. కాకినాడలో ప్రారంభణయింది.
వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తనను.. అత్యంత హీనంగా తిట్టిన మాటలు .. ఓ వైపు ఆయనను.. రగిలిపోయేలా చేస్తూంటే .. మరో వైపు.. నిరసన వ్యక్తం చేసిన జనసైనికులపై ద్వారంపూడి ప్రైవేటు సైన్యం దాడి చేయడాన్ని ఆయన సహించలేకపోతున్నారు. పైగా.. చట్టాన్ని పాటించకుడా పోలీసులు … దాడి చేసిన వారినే కాకుండా.. జన సైనికుల్ని అరెస్ట్ చేశారు. దాంతో.. పవన్ కల్యాణ్.. ఇక మెతగ్గా ఉండే లెక్క చేయరని భావించారు. అదే సమయంలో.. భారతీయ జనతా పార్టీ ఆయనకు అదనపు బలంగా మారింది. దీంతో..నేరుగా ద్వారంపూడిని ఢీకొట్టేందుకు కాకినాడకు పయనమవ్వాలని నిర్ణయించుకున్నారు. జనసేన నేతలందరూ.. అదే కోరుకుంటున్నారు.
నిజానికి జనసైనికుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఒక రోజంతా స్టేషన్లోనే ఉంచారు. కానీ పవన్ కల్యాణ్.. తాను నేరుగా కాకినాడ వస్తానని హెచ్చరికలు జారీ చేయడంతో.. తర్వాతి రోజు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. కానీ.. పవన్ మాత్రం శాంతించలేదు. ఇలాంటి విషయాలను ఇలా వదిలేస్తే.. తర్వాత నెత్తికెక్కుతారని.. నమ్ముతున్నారు. అందుకే.. ద్వారంపూడితో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ఇజ్జత్ కాపాడుకోవాలంటే.. దెబ్బకు దెబ్బ తీయాలన్న లక్ష్యంతో.. జనసైనికులు ఉన్నారు. అందుకే..కాకినాడలో రణరంగం ఖాయంగా కనిపిస్తోంది.