ఈ ఏడాది గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన అంశాలపై ఓ నివేదికను విడుదల చేశారు. ఇందులో వ్యక్తుల విషయానికి వచ్చేసరికి పవన్ కల్యాణ్ టాప్ ఫైవ్ లో ఉన్నారు. దేశవ్యాప్తంగా సెర్చింగ్లో పవన్ ఇలా టాప్లో ఉండటం చిన్న విషయం కాదు. ఈ ఏడాదంతా పవన్ కల్యాణ్ వార్తల్లోనే ఉన్నారు. చంద్రబాబు అరెస్టు దగ్గర నుంచి అన్నీ పవన్ కల్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. టీడీపీతో పొత్తులు ప్రకటించడం.. ప్రచారం.. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉండటం వరకూ అనేక అంశాలపై పవన్ సెంటరాఫ్ ది టాపిక్ అయ్యారు.
ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఆయన రోల్ పై చర్చ జరిగింది. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హిందూత్వ వాదం మీద ఆయన తీసుకున్న స్టాండ్ కూడా హైలెట్ అవుతోంది. మహారాష్ట్ర ప్రచారం.. ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన విమర్శలకు కౌంటర్లు ఇలా .. పవన్ ఈ ఏడాది ప్రతి విషయంలోనూ హాట్ టాపిక్ అయ్యారు. ఆయన కోసం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనేకాదు.. దేశవ్యాప్తంగా సెర్చ్ చేశారు. ట్రెండ్స్ అదే చెబుతున్నాయి.
పవన్ కల్యాణ్ ఈ ట్రెండ్స్ ను సినిమాల ద్వారా సాధించలేదు. రాజకీయాల ద్వారా సాధించారు. పదేళ్ల పాటు కష్టపడిన తర్వాత రాజకీయంగా వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయాలతో ఆయన తన భావజాలంతో నేషనల్ హాట్ టాపిక్ అయ్యారు.