జనసేన అధినేత పవన్ కల్యాణ్ అత్తారింటికి వెళ్లారు. పండగ సంబరాలను అత్తింట్లో జరుపుకునేందుకు వెళ్లారు. ఇప్పుడేమీ పండుగ అనే సందేహం పెట్టుకోవద్దు.. డిసెంబర్ ఇరవై ఐదున.. క్రిస్మస్ ఉంది కదా.. ఆ పండుగకే వెళ్లారు. ప్రపంచ క్రైస్తవులందరికీ… క్రిస్మస్ ఓ పర్వదినం. పవన్ హిందువు కదా.. క్రిస్మస్ ను అంత గొప్పగా..చేసుకుంటారా..? అదీ కూడా కొత్త అల్లుళ్లు..సంక్రాంతికి అత్తారింటికి వెళ్లినట్లుగా.. వెళ్లి మరీ జరుపుకుంటారా..? అనే అనుమానం రావొచ్చు. దీనికి మనం… పవన్ కల్యాణ్ జరుపుకుంటారని.. మనకి మనం చెప్పుకోవాలి. కొత్త అల్లుడా.. పాత అల్లుడా అన్నది కాదు..మ్యాటర్.. పవన్ క్రిస్మస్ కోసం అత్తారింటికి వెళ్లారు.. అంతే. క్రిస్మస్ ఆయన చేసుకోకపోవచ్చు.. కానీ సతీమణి చేసుకుంటారు. పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజ్ నోవా క్రిస్టియన్. ఈ విషయాల్లో పోరాటయాత్రలో పలు సభల్లో ప్రత్యేకంగా చెప్పారు.
తన వ్యక్తిగత విషయాలు పలుమార్లు ప్రస్తావించి.. తన రెండో భార్య రేణుదేశాయ్ పిల్లలు ఎలా ఉంటారో… మూడో భార్య అన్నా లెజ్ నోవా పిల్లలు ఏ మతాలు పద్దతులు ఆచరిస్తారో చెప్పుకొచ్చారు. రెండో భార్య రేణుదేశాయ్ పిల్లలు..మరాఠీ హిందూ పద్దతులు ఆచరిస్తారు. మూడో భార్య పిల్లలు.. తల్లి మతం అయిన క్రిస్టియన్ మతాచారాలను పాటిస్తారని.. నేరుగానే చెప్పారు కూడా. పవన్ కి కులాలు, మతాలు ఉండవు కాబట్టి.. ఎవరూ ఆచరించడానికి అవకాశం లేదని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడా క్రిస్టియన్ మతాచారాల ప్రకారం.. ఇటీవలే జన్మించిన శంకర్ పవనోవిచ్ కు .. కొన్ని సంప్రదాయాలను.. అన్నా లెజ్ నోవా సొంత ఊళ్లో చేయాలని సంకల్పించారు. హిందవులకు, ముస్లింలకు ఉన్నట్లు… క్రిస్టియన్స్ కు ఏముంటాయని అనిపించొచ్చు కానీ.. మనం ఇంగ్లిష్ సినిమాల్లో చూసి ఉంటాం… చర్చిల్లో చాలా పెద్ద తతంగమే నడుస్తూ ఉంటుంది. తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించడానికి ఆయన భార్యను తీసుకుని అత్తారింటికి వెళ్లారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ప్రత్యేకంగా ప్రెస్ నోట్ విడుదల చేసి మరీ వెల్లడించింది. అందరి మనోభావాలను సంపూర్ణంగా గౌరవించే వ్యక్తిగా పవన్ కల్యాణ్ ను ఆ ప్రెస్ నోట్ మన కళ్ల ముందు ఉంచుతుంది.
అయితే ఆ ప్రెస్ నోట్ లో .. ఎక్కడా తన భార్య పేరు ప్రస్తావించలేదు. అలాగే.. తను ఏ దేశం వెళ్తున్నారో కూడా చెప్పలేదు. బహుశా.. తన భార్య పేరు కానీ… ఆమె దేశం కానీ.. ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదని అనుకుని ఉండొచ్చు. అది పూర్తిగా వ్యక్తిగతం కావొచ్చు. కానీ.. యూరప్ వెళ్తున్నట్లు మాత్రం ఓ హింట్ ఇచ్చారు. పవన్ భార్య పేరు అన్నా లెజ్ నోవా అనే పేరు చాలా మందికి తెలుసు కాబట్టి…”అన్నా” అనే పేర్లు రష్యా, ఉక్రెయిన్ దేశస్థులకు ఎక్కువగా ఉంటాయి. ఉక్రెయిన్ కన్నా.. రష్యా వాళ్లకు ఎక్కువగా ఉన్నాయి. అన్నా కౌర్నికౌవా, అన్నా చక్వతడ్జే వంటి ప్రముఖ టెన్నిస్ ప్లేయర్లు ఈ జాబితాలోకే వస్తారు కాబట్టి.. బహుశా పవన్ కల్యాణ్ రష్యాకే వెళ్లి ఉండవచ్చు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల సమరానికి సన్నద్ధతకు ముందుగా.. అత్తారింట్లే దొరికే అతిథి మర్యాదలను అనుభవించడంలో ఓ కిక్ ఉంటుంది. దాన్ని పవన్ ఎంజాయ్ చేయబోతున్నారు..వచ్చిన తర్వాత ఎలాగూ.. పోరాటయాత్రల్లో పోరాటం తప్పదు కదా.. హ్యాపీ క్రిస్మస్ పవన్..!